Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-పెన్పహాడ్
బీజేపి మతోన్మాద, కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా ప్రజా సంక్షేమం, మత సామరస్యం, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం కోసం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో కొనసాగుతున్న జన చైతన్య యాత్రలను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు కోరారు. ఆ పార్టీ మండల కమిటీ సమావేశం కొండమీద రాములు అధ్యక్షతన చీదెళ్ళ గ్రామంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నెమ్మాది మాట్లాడుతూ పార్టీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న యాత్ర రేపు కోదాడ పట్టణానికి చేరుకుంటుందని, ఈ యాత్రకు సూర్యాపేట జిల్లాకు చెందిన వేలాది మంది పార్టీ కార్యకర్తలు స్వాగతం పలికేందుకు పాల్గొంటున్నారని తెలిపారు. యాత్ర జిల్లాలో 25 నుండి 26 వ తేదీ వరకు రెండూ రోజులు వరకు కోదాడ, హుజూర్నగర్, నేరేడుచర్ల వరకు కొనసాగి 26 సాయంత్రం నల్లగొండ జిల్లా మిర్యాలగూడెం చేరుకుంటుందని తెలిపారు. ఈ సమావేశంలో ఆ పార్టీ మండల కార్యదర్శి రణపంగ కృష్ణ, జిల్లా కమిటి సభ్యులు చినపంగి నర్సయ్య, మడ్డి అంజిబాబు, గుంజ వేంకటేశ్వర్లు, ఆడివయ్య, గుఱ్ఱం గోపాలరెడ్డీ, ఇరుగు రమేష్, తదితరులు పాల్గొన్నారు.
పాలకీడు : సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఈనెల 26న హుజూర్నగర్ నియోజకవర్గంలో నిర్వహించే జన చైతన్య యాత్రను జయప్రదం చేయాలని ఆ పార్టీ మండల కార్యదర్శి కందగట్ల అనంత ప్రకాష్ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో సీపీఐ(ఎం) మండల కమిటీ సమావేశం వడ్డే సైదయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) మండల నాయకులు వడ్డే సైదయ్య, పీఏసీఎస్ వైస్ చైర్మెన్ పగడాల మట్టేష్, నాయకులు మల్లారెడ్డి, మాతంగి ఏసురత్నం, ఇరుకు సైదులు, ఆర్లపూడి వీరభద్రం, వెంకటేశ్వర్లు, మాలోత్ హథిరాం తదితరులు పాల్గొన్నారు.