Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆత్మకూరుఎస్
తన భర్త కాపురానికి తీసుకెళ్లకుండా సుమారు ఏడాదిగా ఇబ్బందులకు గురి చేస్తుండడాన్ని నిరసిస్తూ మండలంలోని నేమ్మికల్కు చెందిన అనూష తన చంటి పాపతో ఏనుబాముల స్టీజీ వద్ద గల ఎస్ఆర్ ఫంక్షన్ హాల్ గేటుకు శుక్రవారం తాళం వేసి నిరాహార దీక్షకు దిగింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని నెమ్మికల్ కు చెందిన జటంగి రామనర్సు కూతురు అనూషను 2020 ఫిబ్రవరి లో ఏనుబాముల స్టేజ్ వద్ద గల ఎస్ ఆర్ ఫంక్షన్ హాల్ యజమాని కొరివి వీరన్న కొడుకు ప్రవీణ్ కు ఇచ్చి వివాహం చేశారు. వీరి కాపురం ఏడాదిన్నార పాటు సజావుగా సాగింది. ఒక పాపా సంతానం కల్గింది.ఆ తర్వాత నుంచి అనూష ను భర్త, అత్త, మామ తరచు వరకట్నం వేధింపులకు గురి చేసి, అనుమానిస్తూ ఇంట్లో నుంచి గేంటేశారు. గత ఏడాది కాలంగా పుట్టిన ఇంట్లో పాపతో ఉంటున్న అనూషను భర్త కాపురానికి తీసుకెళ్లడం లేదు. పలుమార్లు పెద్ద మనుషులు పంచాయతీ చేసిన మెట్టింటి వారు అనూష ను తీసుకెళ్లడం లేదు. దీనితో అనూష తన పాపతో శుక్రవారం ఎస్ఆర్ ఫంక్షన్ హాల్ గేటుకు తాళం వేసి నిరాహార దీక్ష కు దిగింది. తనకు న్యాయం జరిగే వరకు ఫంక్షన్ హాల్ వద్ద నిరాహార దీక్ష కొనసాగిస్తానని తెలిపింది. ఈ దీక్షకు మద్దతుగా నెమ్మికల్కు చెందిన మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో అనూష తల్లిదండ్రులు జటంగి రామనర్సు, గణిత, కుటుంబ సభ్యులు జటంగి నాగయ్య, మల్లేష్, వేల్పుల స్వామి, లింగమ్మ, మహిళలు పాల్గొన్నారు.