Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వం ప్రకటించినట్లుగా కౌలురైతులకు పరిహారం అందివ్వాలి
- రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి
నవతెలంగాణ -రామన్నపేట
వడగండ్ల అకాల వానకు నష్టపోయిన రైతులకు పారదర్శకంగా ప్రభుత్వ పరిహారం చెల్లించాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. స్థానిక సిపిఐ(ఎం) పార్టీ మండల కార్యాలయంలో పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కురిసిన ఆకస్మిక వడగండ్లవర్షానికి రామన్నపేట మండలంలోని సిరిపురం, వెల్లంకి, కొమ్మాయిగూడం, సర్నేనిగూడెం గ్రామాల్లో వరిదాన్యం మొత్తం ద్వంసమై రైతులు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లింపు కోసం వ్యవసాయ అధికారులను సర్వే చేయిస్తుండగా యాబై శాతం ద్వంసమైన పంటనే సర్వే చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పచ్చగా ఉండి దాన్యం రాలిన పంటను పరిగణలోకి తీసుకోక పోవడం సరికాదన్నారు. 30 శాతం దాన్యం రాలిన వరిని పరిగణలోకి తీసుకోవాలన్నారు. దెబ్బతిన్న వరి కోత సమయానికి మోత్తం తాలుగా మారి జరగాల్సిన నష్టమంతా జరుగుతుందన్నారు. కౌలు రైతులు అప్పులు చేసి పంట పండిస్తే నష్టం జరిగితే పంట వేసిన కౌలు రైతుకు కాకుండా భూ యజమానికి వేయడం మూలంగా కౌలు రైతులకు కన్నీరే దిక్కైందని ఆయన అవేదన వ్యక్తం చేశారు. వామపక్షాల విజ్ఞప్తి మూలంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కౌలు రైతులకు కూడా పరిహారం అందించాలనీ ప్రకటించినా యాదాద్రిభువనగిరి జిల్లాలో కౌలు రైతుల పేర్లు నమోదు చేసుకోవడంలేదని ఆయన వాపోయారు. ఉత్వర్వులు రాలేదని అధికారులు సమాదానమిస్తున్నారన్నారు. రామన్నపేట మండలంలో వరి పంట నష్టపోయిన వారికి పారదర్శకంగా పరిహారం అందివ్వాలని లేని పక్షంలో రైతులతో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని, ఇచ్చే పరిహారం కూడా ఎకరాకు రూ 30 వేలు అందివ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎం) పార్టీ జిల్లా కమిటి సభ్యులు జల్లెల పెంటయ్య, మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, రైతు సంఘం మండల అధ్యక్ష,కార్యదర్శులు గన్నెబోయిన విజయభాస్కర్, బోయిని ఆనంద్, కందుల హనుమంతు, బల్గూరి అంజయ్య, వైస్ ఎంపిపి నాగటి ఉపేందర్, గాదె నరేందర్, వేముల సైదులు, బోళ్ళ వెంకన్న, ఎర్ర కాటమయ్య తదితరులు పాల్గొన్నారు.