Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ- భూదాన్ పోచంపల్లి
సీపీఐ(ఎం) జన చైతన్య యాత్రను జయప్రదం చేయాలని పోచంపల్లి మండల పరిధిలోని కనుముక్కల గ్రామంలో ఆ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం వాల్ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల కార్యదర్శి వర్గ సభ్యులు కొట్ట రామచంద్రారెడ్డి మాట్లాడుతూ బీజేపీ మతం మాద కార్పొరేట్ విధానాలను వ్యతిరేకిస్తూ ఈనెల 17వ తేదీన ప్రారంభమైన జనచైతన్య యాత్రలు రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతూ ప్రజలను చైతన్యం చేస్తున్నాయన్నారు. అదిలాబాద్‌లో చేపట్టిన జనచైతన్య యాత్ర ఈనెల 28 భువనగిరికి చేరుకుంటున్నదన్నారు. దుంపల మల్లారెడ్డి స్మారకర్థం ప్రారంభోత్సవం సందర్భంగా పెద్ద బహిరంగ సభ నిర్వహిస్తున్నామని సభకు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు మంచాల మధు మండల కమిటీ సభ్యులు నెల కంటి జంగయ్య కలుకూరి బిక్షపతి భీమనపల్లి మాజీ ఎంపీటీసీ బూరుగు బిక్షపతి నాయకులు జనార్దన్ రెడ్డి పాండురంగారెడ్డి మల్లయ్య సమల బుచ్చిరెడ్డి భీమయ్య తదితరులు పాల్గొన్నారు.
ఆలేరు రూరల్:మండలంలోని పటేల్ గూడెం, శర్బనాపురం గ్రామాల్లో జన చైతన్య యాత్ర, పార్టీజిల్లా కార్యాలయం ఈనెల 28న ఉన్న సందర్భంగా సీపీఐ(ఎం) మండల కార్యదర్శి దుపటి వెంకటేష్ ఆధ్వర్యంలో ఆదివారం పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈనెల 28 భువనగిరిలో జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు .ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కార్యవర్గ సభ్యులు పిక్క గణేష్, సుధ గాని సత్య రాజయ్య, నల్ల మాస తులసయ్య, పార్టీ సీనియర్ నాయకులు పులగం యాదిరెడ్డి ,బొమ్మకటి లక్ష్మీనారాయణ, గ్యార అశోక్, భాస్కర్ ,సైదాపురం నరసయ్య, కారే రాజు, సుధ గాని నరేందర్ ,నాగేష్ ,మల్లేష్ ,ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
భువనగిరి రూరల్:కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరశిస్తూ, ప్రజా స్వామ్య పరిరక్షణే, లక్ష్యంగా సీపీఎం పార్టీ తలపెట్టిన జన చైతన్య యాత్రలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి దయ్యాల నరసింహ కోరారు. ఆ పార్టీ అనాజిపురమ్ గ్రామ శాఖ సమావేశం నిర్వహించగా, ఆయన పాల్గొని, మాట్లాడారు.మోడీ ఎనమిదెళ్ళ పాలనలో, పెట్రోల్, డీజిల్, గ్యాస్, ధరలను రోజు రోజుకు పెంచుతూ, పప్పు, ఉప్పు, బట్టలు, చెప్పులు, లాంటి అనేక వాటిపై జీఎస్టీ పేరుతో పన్నులు వేసి నిత్యావసర సరుకులు సామాన్య ప్రజలు కొనలేని పరిస్థితి కల్పించిందన్నారు. ఈ నెల 28న ఉదయం 9 గంటలకు భువనగిరికి చేరుకుంటుందన్నారు. పార్టీలకు అతీతంగా ప్రజా స్వామ్య వాదులు, ప్రజలు, అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలోఆ పార్టీ మండల కార్యదర్శి వర్గ సభ్యులు ఎదునురి మల్లేశం, మండల కమిటీ సభ్యులు గునుగుంట్ల శ్రీనివాస్, అబ్ధుల్లపురం వెంకటేశం, శాఖ కార్యదర్శి ఎదునురీ వెంకటేశం, నాయకులు కడరి కృష్ణ, ముచపతీ బాలయ్య, గంగాదరి వెంకటేశం, మైలారం శివ, గంగనబోయిన పాండు, బోల్లేపల్లి కిషన్, ఆకుల బిక్షపతి లు పాల్గొన్నారు.