Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీలో రిజర్వేషన్ల అమలు
- లక్కీ డ్రా లో వీడియో చిత్రీకరణ
నవతెలంగాణ- ఆలేరుటౌన్
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీలో అధికారుల ప్రవేశపెట్టిన లిస్టు దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఆరుసార్లు అఖిలపక్ష సమావేశాల అనంతరం శనివారం సాయంత్రం తాసిల్దార్ రామకృష్ణ ఆధ్వర్యంలో జిల్లా ఉన్నతాధికారుల, ఉన్నత స్థాయి ప్రజా ప్రతినిధుల సూచన మేరకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీలో రిజర్వేషన్ల ఆమాలు ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. శనివారం ఉదయం 45 నిమిషాలలో దరఖాస్తుదారులతో ప్రజా ప్రతినిధుల ముందు సమావేశం ముగిసినప్పటికీ వాగ్వాదంతో వాయిదా పడింది. తిరిగి సాయంత్రం 5 6 గంటల సమయంలో వీడియోను చిత్రీకరించి డ్రా తీసినట్లు అధికారులు చెబుతున్నారు. గతంలో ఇందిరమ్మ ఇల్లు, ప్రభుత్వం నుండి ఇతర లబ్ది పొందినట్లయితే వారిని గుర్తించి తొలగిస్తున్నట్లు తెలుస్తుంది. అందరి ఆమోదం మేరకు లబ్దిదారున్ని ఎంపిక చేస్తున్నామనిరెవిన్యూ అధికారులు మాత్రం చెబుతున్నారు. డ్రాలో వచ్చిన పేర్లను సైతం తిరిగి వడబోసి, అనారులను గుర్తించి తిరిగి అర్హత కలిగిన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించడానికి అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
మీడియా జర్నలిస్టులు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ చివరి వరకు సహకరించాలని అధికారులు కోరుతున్నారు. ప్రచారం చేస్తూ వార్తలు ప్రచురించి దరఖాస్తుదారులను అయోమయానికి గురి చేయొద్దని కోరుతున్నారు. డబుల్ బెడ్ రూంలో ఇండ్ల పంపిణీ చివరి వరకు ఎవరో ఒకరు, అదేపనిగా అధికారులను వ్యతిరేకిస్తూనే ఉంటారని చర్చ జరుగుతుంది. సమస్యను జటిలం చేయొద్దని రెవిన్యూ అధికారులు
అన్ని వర్గాల ప్రజలను అఖిలపక్ష నాయకులను మీడియాను కోరడం విశేషం. నిజమైన లబ్ధిదారులకు ఇళ్ల పంపిణీ జరుగుతుందని చెబుతున్నారు. పొలిటికల్ పార్టీ ల ఒత్తిళ్లకు తలగంగకుండా, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తామని తాసిల్దార్ రామకృష్ణ తెలిపారు. ఆలేరు పట్టణంలో శనివారం షాదీ ఖానా, వై ఎస్ ఎన్ ఫంక్షన హల్ ఆవరణలో డబుల్ బెడ్ రూమ్ ఇలా ఎంపిక ప్రక్రియ రసభ సగా మారడంతో తాసిల్దార్ రామకృష్ణ జిల్లా కలెక్టర్ పామేలసత్పత్తికి పూర్తి వివరాలు తో కూడిన నివేదికను తాసిల్దార్ అంద చేసినట్లు తెలుస్తుంది. అఖిలపక్ష నాయకుల సమక్షంలో లబ్ధిదారుల సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ,
ఉదయం 9 గంటలకు ప్రారంభమైన సమావేశం, ప్రారంభం కాగానే రసభసగా మారింది. కేవలం 40 నిమిషాలలో ముగిసింది. అధికార టీఆర్ఎస్ పార్టీ వారికే, అధికారులు కొమ్ము కాస్తున్నారని లబ్ధిదారుల ఆరోపించారు. డబుల్ బెడ్ రూమ్ లు 64 ఉన్నప్పటికీ, 500 పైచిలుకు దరఖాస్తులు రావడం తో, రెవిన్యూ అధికారుల గత సమావేశాల వడబోతలో 120 మిగిలాయి.గతంలో ప్రభుత్వం నుండి లబ్ధి పొందిన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వద్దని దరఖాస్తుదారులు నినాదాలు చేశారు. నిజమైన అర్హులనే గుర్తించాలని , అధికార పార్టీ వారు చెప్పిన వారికి కాకుండా మాకే ఇవ్వాలని పట్టుబట్టారు. ఇండ్లు ఉన్నవారు సైతం మాకు కావాలని రావడమేంటని ,గత 20 సంవత్సరాలుగా కిరాయిలకుంటున్న లబ్ధిదారులు వాపోతున్నారు. కౌన్సిలర్ గుత్తా శమంత రెడ్డి నిజమైన లబ్ధిదారులకు ఇల్లు కేటాయించాలని కోరుతూ నిరసన తెలిపారు. ఎస్ఐ ఎండి ఇద్రీస్ అలీ ఆధ్వర్యంలో రాజపేట యాదగిరిగుట్ట ఎస్ఐ లతోపాటు 20 మంది మహిళ
పోలీసులు రంగ ప్రవేశం చేసి సభ వద్ద గొడవ జరగకుండా శాంతింప చేశారు. అల్లర్లు జరగకుండా పెద్ద ఎత్తున పోలీసులు హాజరు కావడం జరిగింది. 9 మంది కౌన్సిలర్లు గైరహాజరయ్యారు.
తాసిల్దార్ రామకృష్ణ మాట్లాడుతూ నిజమైన లబ్ధిదారులని గుర్తించి లాటరీ పద్ధతి ద్వారా త్వరలోనే డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. లబ్ధిదారుల నుండి ఒత్తిడి తగ్గించేందుకే
పాలకపక్ష సభ్యులను ,అఖిలపక్ష నాయకులను ఒత్తులు లేకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే అధికారులు గోప్యంగా లాటరీ పద్ధతి ద్వారా వీడియో చిత్రీకరణలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రక్రియ డ్రా తీసి,డ్రా తీసిన వాటిలో సైతం నిజమైన అర్హులను గుర్తించి ఇలా పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది.