Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఆలేరు టౌన్
శక్తివంతమైన, ఆరోగ్య కరమైన సమాజ నిర్మాణం కోసమే ఆర్యజనని కృషి చేస్తుందని హైదరాబాదు రామకృష్ణ మఠం ఆసుపత్రి డాక్టర్ అంజలి అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం శ్రీ రామకృష్ణ విద్యాలయం ఆవరణలో గర్భిణీ స్త్రీల ఆరోగ్య సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా ఆమె హాజరై మాట్లాడుతూ శిశువు యొక్క మానసిక, శారీరక ఎదుగుద లకు తల్లి ఆరోగ్యము ప్రధాన పాత్ర పోషిస్తుందని అన్నారు. హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్వర్యంలో, సంఘ మిత్ర సేవాసమితి, శ్రీ రామకృష్ణ విద్యా లయం సౌజన్యంతో జరిగిన గర్భిణుల అవగాహన సదస్సు వారికితో ఉపయోగ పడుతుందన్నారు. అనం తరం 'న్యూట్రీషన్ ఫుడ్ కిట్'' లను పంపిణీ చేసారు. కార్యక్రమ సమన్వయకర్తగా శ్రీ రామకృష్ణ విద్యాలయ కరస్పాండెంట్ బండిరాజుల శంకర్ వ్యవహరించారు.ఈ కార్యక్రమంలో సంఘమిత్ర సేవా సమితి అధ్యక్షులు బొట్ల సంపత్ కుమార్ దంపతులు, 5వ వార్డు కౌన్సిలర్ సంగు భూపతి, పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ పెద్దలక్ష్మి, ప్రోగ్రామ్ ఇంచార్జ్ దశరథ, పులిపలుపుల మహేశ్, వడ్డెమాన్ కిషన్, పంగ భిక్షపతి, జూకంటి సిద్ధులు, కంతుల శంకర్, దూడల వెంకటేశ్, చంద్రగిరి వెంకటేశ్, అయిలి సందీప్, మార్ల సాయి తదితరులు పాల్గొన్నారు.