Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
ధర్మభిక్షంను స్మరించుకోవడమనేది సూర్యాపేట ప్రజల బాధ్యత అని ,సూర్యాపేట పేరు ప్రతిష్టలను దేశవ్యాప్తంగా ఇనుమడింప చేసిన మహనీయుడని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.మాజీ శాసన సభ్యులు, పార్లమెంట్ సభ్యులు బొమ్మగాని ధర్మభిక్షం 12 వ వర్థంతి సందర్భంగా ఆదివారం స్థానిక ఎన్టీఆర్ పార్క్ వద్ద గల ధర్మభిక్షం విగ్రహానికి ఆయన పూలమాలలేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చదువుతోనే జీవితానికి వెలుగు అని నమ్మిన నేత ధర్మభిక్షం అన్నారు.ప్రజల కోసమే జీవితాన్ని దారాదత్తం చేసిన నాయకుడని కొనియాడారు.ఆయన జీవితం తరతరాలకు స్ఫూర్తి అన్నారు.కల్లుగీత కుటుంబంలో జన్మించిన ధర్మభిక్షం కల్లు గీత కార్మికుల సమస్యల పరిష్కారానికి శ్రమించారని తెలిపారు. దున్నేవాడిదే భూమి అన్నట్టుగా గీసేవాడిదే చెట్టు అన్న నినాదం ఇచ్చి వారి హక్కుల కోసం పోరాడారని పేర్కొన్నారు. ఆయన సాగించిన కృషి ఫలితంగానే ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి పడిపోయిన కార్మికులకు ఎక్స్‌గ్రేషియా అమలులోకి వచ్చిందని చెప్పారు.ఈ సందర్భంగా సూర్యాపేట ముఖ ద్వారం అయిన చౌరస్తాకు ధర్మభిక్షంచౌక్గా నామకరణం చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్‌్ పెరుమాళ అన్నపూర్ణమ్మ,జిల్లా పరిషత్ వైస్‌చైర్మెన్ గోపగాని వెంకట్‌నారాయణగౌడ్, గ్రంథాలయ చైర్మెన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్,మున్సిపల్ వైస్‌చైర్మెన్ పుట్టా కిషోర్, కౌన్సిలర్లు లక్ష్మీకాంతమ్మ, రాపర్తి శ్రీనివాస్‌గౌడ్, అనతుల యాదగిరిగౌడ్, ఆకుల లవకుశ,బీఆర్ఎస్ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు సవరాల సత్యనారయణ, బూర బాలసైదులుగౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మారిపెద్ది శ్రీనివాస్‌గౌడ్, బైరు వెంకన్నగౌడ్, కక్కిరేని నాగయ్యగౌడ్,శెనగాని రాంబాబుగౌడ్, యూత్ నాయకులు ఎల్గూరి రాంబాబు, గుండపునేని కిరణ్,అనంతులవిజయ్,దేశగాని శ్రీనివాస్‌గౌడ్, రఫీ, తదితరులు పాల్గొన్నారు.