Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి
నవతెలంగాణ-నేరేడుచర్ల
ఏప్రిల్ మాసంలో జరగనున్న జగ్జీవన్ రామ్,జ్యోతిబాఫూలే,అంబేద్కర్ జయంతుల స్పూర్తితో రాజ్యాంగ రక్షణ కోసం ఉద్యమించాలని కెేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి పిలుపునిచ్చారు.ఆదివారం నేరేడుచర్లలోని టౌన్హాల్లో నిర్వహించిన ఆసంఘం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చి మనుధర్మశాస్త్రాన్ని అమలు చేయాలని చూస్తుందన్నారు.భారత రాజ్యాంగాన్ని మోసం చేస్తే దళితులు బలహీన వర్గాలకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్లు తొలగించబడతాయని పేర్కొన్నారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనకరంగా ఉన్న రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం అన్ని వర్గాల ప్రజలు ఐక్య ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.ఏప్రిల్ మాసంలో జరగనున్న మహనీయుల జయంతుల స్ఫూర్తితో జిల్లాలో రాజ్యాంగ రక్షణ కోసం యాత్రలు చేపట్టనున్నట్లు తెలిపారు.దళితులపై జరుగుతున్న దాడులు, హత్యలు అరికట్టాలని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రాజ్యాంగ వ్యతిరేక విధానాలపై గ్రామ గ్రామాన ప్రచారం నిర్వహిస్తామన్నారు.రాజ్యాంగ రక్షణ కోసం జరగనున్న యాత్రలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షులు మర్రి నాగేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు నందిగామ సైదులు, జిల్లా నాయకులు కోదాటి సైదులు,దోరేపల్లి వెంకటేశ్వర్లు, గుర్రం ఏసు, సైదులు తదితరులు పాల్గొన్నారు.