Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు నల్లగొండ, నకిరేకల్, చిట్యాలలో భారీ బహిరంగ సభలు మోటార్ సైకిళ్లతో భారీ ర్యాలీ ప్రదర్శనలు
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి
నవతెలంగాణ-నార్కట్‌పల్లి
బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ మోడీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజలను చైతన్య పరచడం కోసమే జన చైతన్య యాత్రలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి పేర్కొన్నారు. నేడు జరగనున్న నల్లగొండ, నకరేకల్, చిట్యాల జనచైతన్య యాత్ర రూట్ మ్యాప్‌పై సీపీఐ(ఎం) శ్రేణులతో ఆదివారం ఆయన చర్చించారు. చైతన్య యాత్రలో నార్కట్‌పల్లి జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాల ర్యాలీ ఉంటుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న జనచైతన్య యాత్రలు దేశ ప్రజల రక్షణ కోసమేనని చెప్పారు. ఈ సందర్భంగా తుమ్మల వీరారెడ్డి నవతెలంగాణతో మాట్లాడుతూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, పోకడలు చూస్తుంటే నియంతృత్వ పాలనను తలపిస్తుందన్నారు. ప్రజాస్వామ్య దేశంలో మాట్లాడే హక్కు లేనట్లుగా ఉందని ఆరోపించారు. నేడు కోర్టులను, చట్టాలను తమ చేతుల్లోకి తీసుకొని చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తూ ఉన్మాదపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. దేశ సమైక్యత, సమగ్రత, లౌకిక తత్వాన్ని కాపాడాల్సిన కర్తవ్యం ప్రజల ముందు ఉన్నదని తెలిపారు. నేడు జరగనున్న జనచైతన్య యాత్రలో ముఖ్య అతిథులుగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, పోతినేని సుదర్శన్, జూలకంటి రంగారెడ్డి, చెరుపల్లి సీతారాములు, నంద్యాల నరసింహారెడ్డి, ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొననున్నట్లు తెలిపారు. నల్లగొండ జిల్లాలో యాత్ర బహిరంగ సభ ఉంటుందన్నారు. 27 ఉదయం నల్లగొండలో, మధ్యాహ్నం ఒంటిగంటకు నకిరేకల్, సాయంత్రం 6 గంటలకు చిట్యాలలో ఈ మూడు బహిరంగ సభలు ఉంటాయని తెలిపారు. 29వ తేదీన ముగింపు హైదరాబాదులో ఇందిరాపార్క్ దగ్గర జరుగుతుందని చెప్పారు. రాబోయే కాలంలో బీజేపీకి వ్యతిరేకంగా కలిసి వచ్చే లౌకిక శక్తులు ప్రజాస్వానికి శక్తులు అందరూ కలిసి దేశ వ్యాప్తంగా బీజేపీని ఓడించాలనే నినాదంతో ముందుకు వెళ్లాలన్నారు. భారతదేశంలో మోడీ పరిపాలనలో కార్మికులు ఉద్యోగులు పేద ప్రజలు అట్లాగే దళితులు మైనార్టీలు మీద దాడులు జరుగుతున్నాయన్నారు. ప్రజాస్వామిక విలువను లౌకిక విధానాల వచ్చి మనువాద సిద్ధాంతాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందని తెలిపారు. అందుకే బీజేపీ, ఆర్ఎస్ఎస్ రెండు కలిసి సమాంతర వ్యవస్థను అన్ని వ్యవస్థలో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుందని పేర్కొన్నారు. ఆదాని, అంబానీ కోట్లు సంపాదిస్తూ ఆసియా ఖండంలోనే కుబేరులుగా ఉన్నారని దానికి కారణం మోడీ అని ఆరోపించారు. ప్రభుత్వ సంస్థలన్నింటిని ఆదాని, అంబానీలకు మోడీ కారుచౌకగా అమ్మేస్తున్నారని చెప్పారు. వ్యవస్థలో మోడీ పరిపాలన చూసిన తర్వాత కేవలం కొంతమందికి కార్పొరేట్ వ్యక్తులకు పని చేసే వ్యక్తిగా కనబడుతున్నాడని తెలిపారు. ఇలాంటి ఎజెండా అంతా కూడా పబ్లిక్‌లోకి తీసుకెళ్లి రాష్ట్రంలో కేసీఆర్ కూడా ఈరోజు బీజేపీ వ్యతిరేకంగా పోరాటంలో కలిసి వస్తున్నారు. రాష్ట్రంలో మాట్లాడుతున్న బీజేపీ నాయకులు బండి సంజరు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు రాహుల్ గాంధీని తప్పుడు కేసులు బనాయించి పార్లమెంటు సతృత్వాన్ని రద్దు చేయడం చీకటి రోజుగా పరిగణించాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న శక్తులను కలుపుకుని భవిష్యత్తులో పోరాల్సిన అవసరం ఉందన్నారు. ఈ జన చైతన్య యాత్ర సభలో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.