Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పోతినేని సుదర్శన్
- బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు తెలియజేసేందుకు జనచైతన్యయాత్రలు
- మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
- ప్రజలంతా చైతన్యవంతులై కేంద్ర ప్రభుత్వవిధానాలపై పోరాడాలి
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి
నవతెలంగాణ-నేరేడుచర్ల
దేశ ప్రజలకు ప్రధాని మోడీ ఇచ్చిన ఏ ఒక్క హామీఅమలుకు నోచుకోలేదని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పోతినేని సుదర్శన్ విమర్శించారు.ఆదివారం నేరేడుచర్ల పట్టణ చౌరస్తాలో జరిగిన జనచైతన్యయాత్ర బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని నమ్మబలికి నేడు ఆ ఊసే ఎత్తడం లేదన్నారు.పేదలకు పూర్తిస్థాయిలో ఇండ్లు,స్థలాలు ఇస్తానన్న మాటను మరిచారన్నారు.2015 ఆగస్టున రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని వారిని నట్టేటా ముంచారన్నారు.దేశంలో ప్రజాస్వామ్యం లేకుండా చేస్తూ మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారన్నారు.దేశ ఆస్తులను అప్పనంగా అదాని,అంబానికి తెగ నమ్ముతున్నారన్నారు. దేశ ప్రజల మీద అధికధరలు,నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెంచుతూ, పన్నులు వేస్తూ, సామాన్యుడి నడ్డి విరుస్తున్నారన్నారు.దేశంలోని వివిధ రాష్ట్రాలలో ప్రభుత్వాలను కూల్చివేస్తూ ప్రజాస్వామ్యాన్ని అబాసు పాలు చేస్తుందన్నారు.చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు సిద్ధమని ఆనాడు ప్రకటించి నేడు పార్లమెంట్లో పూర్తి మెజారిటీ ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టిన పెట్టడం లేదన్నారు.
బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు తెలియజేసేందుకు జనచైతన్యయాత్రలు
మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
బీజేపీ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలకు వాస్తవాలు తెలియజేయడానికి జన చైతన్య యాత్రతో ప్రజల వద్దకు వస్తున్నట్టు తెలిపారు.135 కోట్ల ప్రజల భవిష్యత్‌ను నిర్ణయించే మోడీ అన్ని వర్గాల ప్రజలకు నష్టం చేసే చర్యలు తీసుకుంటున్నారని ప్రజాక్షేత్రంలో ఎండగట్టారు.ఏడాదికి రూ.45 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టే కేంద్రం, పేద ప్రజలపై ధరలపై ధరలు, పన్నులు వేయడం ఏంటని ప్రశ్నించారు. మోడీ పచ్చి రైతు వ్యతిరేకి అని, రైతులను వ్యవసాయం నుంచి తప్పించడానికి నల్లచట్టాలు తీసుకొచ్చారని గుర్తు చేశారు.ఉత్తర భారతదేశంలోని రైతాంగం ఐక్యమై 13 నెలలపాటు కఠోర దీక్షలు చేయడం మూలంగా వాటిని వెనక్కు తీసుకున్న మోడీని నమ్మడానికి వీలులేదని ప్రజలకు గుర్తు చేశారు.550 రైతుసంఘాలు, 5 లక్షల మంది భారీ రైతాంగంతో ఏప్రిల్ 5న ఢిల్లీలో భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు.పెద్దనోట్లు రద్దు చేసిన మోడీ ఒక్క రూపాయి నల్లడబ్బులు బయటికి తేలేదని ఎద్దేవా చేశారు.ప్రతి కుటుంబానికి అకౌంట్లో రూ. 15 లక్షలు ఇస్తామని కథలు చెప్పి ప్రజలను మోసగించారన్నారు.కార్మిక చట్టాలను గౌరవించని ఈ మోడీకి అధికారంలో ఉండే అర్హత లేదన్నారు.కార్పొరేట్ వ్యవసాయాన్ని రంగంలోకి దింపాలని చూస్తున్న మోడీని సాగనంపాలని ప్రజలను కోరారు. పేదలకు ఇండ్లు,స్థలాలు ఇవ్వలేని దుర్మార్గుడు మోడీ అన్నారు.70 ఏండ్ల కాలంగా దేశ ప్రజలు కూడా పెట్టిన ఆస్తులను అప్పనంగా కారు చౌకగా అదాని,అంబానీ లాంటి కార్పొరేట్‌శక్తులకు కట్టబెట్టడం ఏంటని ప్రశ్నించారు.గ్యాస్ ధరను రూ.400 నుంచి రూ.1250కు పెంచిన ఆయన ఎరువులు, నిత్యావసరాల ధరలను అమాంతం పెంచి సామాన్యుడు బతకలేని స్థితికి నెట్టివేశారని మండిపడ్డారు.బరితెగించి ప్రజలపై పన్నులు వేస్తున్న వీరికి వారి పార్టీకి బుద్ధి చెప్పాలని హితవు పలికారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు రూ.65 లక్షల కోట్ల అప్పులు ఉంటే నేడు రూ.145 లక్షల కోట్లకు పెరగడం ఏంటని ప్రశ్నించారు.ఓవైపు అప్పులు పెరుగుతూ దేశ నికర సంపదను అప్పనంగా అమ్ముతూ దేశాన్ని లూటీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రజలకు ఇవేమీ అర్థం కాకుండా చేయడానికి మతోన్మాదాన్ని దేవుని ముందుకు తీసుకొస్తున్నారని విమర్శించారు.ఆదాని ఆస్తులు రూ.50 వేల కోట్ల నుండి రూ.11 లక్షల కోట్లకు పెరగడాన్ని దేశ ప్రజలు గమనించాలని కోరారు. ఇన్ని పాపాలు చేసిన మోడీని, బీజేపీని దేశం నుండి తరిమికొట్టాలని, ప్రజలను చైతన్యవంతం చేయడానికి యాత్రను జరుపుతున్నామని స్పష్టం చేశారు. ప్రజల నుండి ప్రజాసంఘాల నుండి మంచి ఆదరణ లభిస్తుందని తెలిపారు.మునుగోడు ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్తో కలిసి పని చేయడానికి ప్రధాన కారణమైన బీజేపీని ఓడించడానికి అని స్పష్టం చేసిన ఆయన, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే నిలదీసి నిగ్గదీస్తామని స్పష్టం చేశారు.దేశంలో ఒకే పార్టీ, ఒకే భాష, ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని విస్తరింపచేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్న బీజేపీని కట్టడి చేయడంలో ప్రజలందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వంతో స్నేహబంధం ఎన్నికలు, ఎన్నికల పోరాటం అన్న చందంగా ఉంటుందని స్పష్టం చేసిన ఆయన, ప్రజా సమస్యల పట్ల వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని కుండబద్దలు కొట్టారు. సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి కె.నగేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యులు విజ్జు ,కృష్ణన్, సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు, మండల కార్యదర్శి సిరికొండ శ్రీను,బీఆర్ఎస్ పట్టణ కార్యదర్శి చిత్తలూరు సైదులు, కుంకు తిరుపతయ్య, నీలా రామ్మూర్తి,పాతూరి శ్రీనివాస్ అనగంటి మీనయ్య,ఎడ్లసైదులు, ఎస్కె.ఆఫీజ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజలంతా చైతన్యవంతులై కేంద్ర ప్రభుత్వవిధానాలపై పోరాడాలి
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి
సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనచైతన్యయాత్రతో ప్రజలంతా చైతన్యవంతులై కేంద్ర ప్రభుత్వ విధానాల మీద సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలన్నారు.రానున్నకాలంలో కేంద్ర ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా కార్మిక, కర్షక , నిరుద్యోగ , ప్రజాస్వామ్య లౌకికవాదులతో కలిసి పోరాటాలు నిర్వహించాలన్నారు. బీఆర్ఎస్ పట్టణ కార్యదర్శి చిత్తలూరి సైదులు మాట్లాడుతూ ప్రజా చైతన్య యాత్రకు హాజరై ప్రజా సమస్యల పట్ల నిరంతరం పోరాటం చేసే ఎర్రజెండా పార్టీకి తమ సంపూర్ణ మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు.ప్రజా సమస్యల్ని ఎజెండాగా ఉంచుకొని ప్రజలను చైతన్యం పరిచే యాత్రకు బాధ్యత వహించిన నాయకత్వాన్ని అభినందించారు.
జోరుగా సాగిన జన చైతన్యయాత్ర
పట్టణం నుండి బయలుదేరి మోటార్ సైకిల్ ర్యాలీ
అభివాదాలతో ఆకర్షణగా నిలిచిన జూలకంటి రంగారెడ్డి
హుజూర్‌నగర్‌టౌన్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక, మతోన్మాద విధానాలను ప్రజలకు తెలియజేసి చైతన్యపరిచేందుకు సీపీఐ(ఎం) చేపట్టిన జన చైతన్యయాత్ర ఆదివారం పట్టణం నుండి ప్రారంభమైంది.ఈ యాత్ర గరిడేపల్లి, నేరేడుచర్ల మీదుగా మిర్యాలగూడ బయల్దేరింది.పట్టణంలోని మేళ్లచెర్వు బైపాస్ రోడ్డు నుండి బయల్దేరిన యాత్రలో మోటార్ సైకిల్‌ర్యాలీ ప్రత్యేకంగా అలరించింది.సీపీఐ(ఎం) నాయకులు పార్టీ జెండాలతో మోటార్ సైకిళ్లపై బయల్దేరి ప్రధానవీధుల గుండా బయల్దేరి వెళ్లారు.సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్‌రావు, జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి మోటార్ సైకిళ్లపై ప్రయాణిస్తూ నాయకులు, కార్యకర్తలలో ఉత్సాహం నింపారు.కాగా మిర్యాలగూడరోడ్డులో మోటార్ సైకిళ్ల ర్యాలీకి ప్రజలు భారీగా ఎదురొచ్చి అభివాదం చేశారు.కాగా బుల్లెట్ ద్విచక్ర వాహనంపై వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మోటార్ సైకిల్‌పై అభివాదం చేసిన తీరు ప్రత్యేకంగా ఆకట్టుకుంది.జన చైతన్య యాత్రకు ప్రజల నుండి భారీగా స్పందన ఉండడంతో ఎంత హుషారుగా ర్యాలీ కొనసాగింది.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, పట్టణ కార్యదర్శి నాగారపు పాండు, జిల్లా కమిటీ సభ్యులు పల్లె వెంకటరెడ్డి ,దుగ్గి బ్రహ్మం, మండల కార్యదర్శులు పోసనబోయిన హుస్సేన్, షేక్ యాకుబ్, బాలునాయక్, వట్టెపు సైదులు, సుందరమౌలేశ్వర్రెడ్డి, అనంతప్రకాష్, కౌన్సిలర్ త్రివేణి, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు శీలం శ్రీను, పాండునాయక్, యోనా, మురళి, పిన్నపురెడ్డి వెంకటరెడ్డి, చిన్నం వీరమల్లు, వెంకటనారాయణ, నాగేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా స్వాగతం
అ అడుగడుగునా జన నీరాజనం
నవతెలంగాణ-గరిడేపల్లి
రాష్ట్రంలో కొనసాగుతున్న జనచైతన్యయాత్ర 10వ రోజు మండలానికి మండలపరిధిలోని రానియిగూడెం వద్దకు చేరుకుంది.మండల పార్టీ శ్రేణులు మండలకార్యదర్శి షేక్ యాకుబ్ ఆధ్వర్యంలో కోలాటాలు, డప్పుల నడుమ పూలమాలలతో ఘనంగా ఆహ్వానం పలికారు.ఈ సందర్భంగా ప్రతి గ్రామంలో ప్రజలు నాయకులకు అడుగడుగునా నీరాజనం పలికారు.యాత్ర మండలంలో సుమారు 500 మంది ప్రతినిధులతో కొనసాగింది. యాత్ర మండలంలోని కీతవారిగూడెం, అప్పన్నపేట గ్రామాల నుండి మండల కేంద్రానికి చేరుకోగా అక్కడ నుండి పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటిరంగారెడ్డి, పోతినేని సుదర్శన్‌రావు, జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి బైక్‌ర్యాలీ నిర్వహించారు.బైక్‌ర్యాలీ మండలంలోని ఎల్బీనగర్ వరకు ఘనంగా కొనసాగింది.ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ మండల కార్యదర్శి కొలిపాక వంశీకృష్ణ, మండల నాయకులు తుమ్మల సైదయ్య, షేక్ వలీ, దోసపాటి భిక్షం, యానాలసోమయ్య, యానాలరాజేష్, అంబటిభిక్షం, మచ్చ వెంకటేశ్వర్లు, జుట్టుకొండ వెంకటేశ్వర్లు, బొల్లిపల్లి శ్రీనివాస్, దోసపాటి సుధాకర్, నందిపాటి నాగయ్య, వట్టికూటి అంజయ్య, యాదగిరి,ఎస్కె.జాని, వెంకన్న, సైదులు, అరవిందు, మట్టయ్య పాల్గొన్నారు.