Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
సామాజికస్పృహలో భాగంగా ఈ వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సోమయ్య,అనిల్‌కుమార్ తెలిపారు.ఆదివారం స్థానిక యూటీఎఫ్ భవన్లో మెడివిజన్ కంటి వైద్యశాల హైదరాబాద్ వారి సౌజన్యంతో ఉద్యోగులు,ఉపాధ్యాయుల, పెన్షనర్ల వారి ఆధారిత కుటుంబసభ్యులకు నిర్వహించిన కంటి వైద్య శిబిరంలో వారు మాట్లాడారు.గతంలో కూడా అనేక రకాల సామాజిక సేవా కార్యక్రమాలు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించామని తెలిపారు.90 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు.13 మందికి కంటి ఆపరేషన్లు అవసరమని గుర్తించి వారిని హైదరాబాద్‌కు తరలించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి వెంకటయ్య, రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు యాకయ్య, జిల్లా కార్యదర్శులు వీరారెడ్డి,పాపిరెడ్డి,రమేష్, వైద్య సిబ్బంది శేఖర్, వాసు,జిల్లా అకాడమిక్ కమిటీ కన్వీనర్ ఆర్.శ్రీను ,జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ శ్రీనివాసాచారి, వివిధ మండలాల బాధ్యులు సీనయ్య, ఎన్.సైదా, పి.కర్నాకర్‌రెడ్డి, వై.లింగయ్య, డి.బాలాజీ, వి.గోవర్ధన్, డి చందు, చక్రు, వెంకట్రాంరెడ్డి పాల్గొన్నారు.