Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ -చిట్యాల టౌన్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తోన్న మతోన్మాద, కార్పొరేట్ విధానాలను వ్యతిరేకించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు పిలుపునిచ్చారు. సీపీఐ(ఎం) జనచైతన్య యాత్ర సోమవారం రాత్రి చిట్యాల పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన చెరుపల్లి సీతారాములతో కలిసి మాట్లాడుతూ.. దేశంలో అత్యధికంగా ఉన్న హిందువులను మోసగిస్తూ... వారిని ఇతర మతాల మధ్య విభేదాలు సష్టించేలా బీజేపీి ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీి ప్రభుత్వానికి ఎవరు వ్యతిరేకంగా పనిచేసిన వారిపై కక్షగడుతుందని ఆరోపించారు. 8రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టిన పాపపు చరిత్ర బీజేపీది అన్నారు. ప్రభుత్వ ఆస్తుల నన్నింటిని కారు చవుకగా కార్పొరేటు శక్తులకు అప్పగిస్తుందని విమర్శించారు. బీసీ జనగణన చేయాలని కేంద్రంలోని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నప్పటికీ కేంద్రం పట్టించుకోవడం లేదదన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఉన్న అధికారాలను బీజేపీ ప్రభుత్వం హరిస్తుందన్నారు. విద్యుత్తు రంగంపై రాష్ట్రాలకు అధికారం లేకుండా చేస్తున్నారన్నారు. కులాలు, మతాల ప్రస్తావన లేకుండా ఒకే కులం అని చెప్పే దమ్ము కమ్యూనిస్టులకే ఉందన్నారు. కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పనిచేస్తున్నందునే తాము మద్దతునిస్తున్నామని చెప్పారు. రాబోయే ఎన్నికలలో కూడా బీిఆర్ఎస్తో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. రాజకీయంగా టిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేసినా పేద ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం బీజేపీి, కేసిఆర్ ప్రభుత్వం పై పోరు కొనసాగుతూనే ఉంటుందని అన్నారు. జన చైతన్య యాత్ర బహిరంగ సభలో ఆ పార్టీ రాష్ట్రకార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మల్లు లక్ష్మీ, జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, జిల్లాకార్యదర్శివర్గ సభ్యులు తుమ్మల వీరారెడ్డి, బండా శ్రీశైలం, కందాల ప్రమీల, నారి ఐలయ్య, పాలడుగు నాగార్జున, సయ్యద్ హశం, మేక అశోక్ రెడ్డి, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి లోడింగ్ శ్రవణ్ కుమార్, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి పోకల దేవదాస్ఆ పార్టీ నాయకులు జిట్ట నగేష్, మల్లం మహేష్, అవిశెట్టి శంకరయ్య, జిట్ట సరోజ, నారబోయిన శ్రీనివాసులు, శీల రాజయ్య, అర్రూరి శ్రీనివాసులు, రుద్రారం పెద్దులు, తదితరులు పాల్గొన్నారు.
29న జన చైతన్య యాత్ర బహిరంగ సభను జయప్రదం చేయాలి : పోతినేని
చిట్యాల : ఈ నెల 29న ఇందిరాపార్కులో జరిగే జన చైతన్య యాత్ర బహిరంగ సభను జయప్రదం చేయాలని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ కోరారు. పట్టణకేంద్రంలో జనచైతన్యయాత్ర బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ బీజేపీ మతోన్మాద కార్పొరేట్ విధానాలను నిరసిస్తూ ఈ నెల 17న హన్మకొండలో ప్రారంభమైన జన చైతన్య యాత్ర 29కి హైదరాబాద్ చేరుకుంటుందని యాత్ర ముగింపు సందర్భంగా ఇందిరాపార్క్ లో బహిరంగ సభ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా జరిగే సభలో సీపీఐ(ఎం) పోలీట్ బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్ హాజరుకానున్నట్టు చెప్పారు. దేశంలో బీజేపీ మతోన్మాద విధానాలతో పాటుగా అప్రజాస్వామిక చర్యలు పెరిగిపోతున్నాయని విమర్శించారు. ప్రశ్నించే వారిపై నిర్భందాలు పెంచి తమ ప్రభుత్వ లోపాలను కప్పి పుచ్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.కాంగ్రేస్ నేత రాహూల్ గాంధీ పార్లమెంట్ లో ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు ఆయన పార్లమెంటరీ సభ్యత్వాన్ని రద్దు చేయడం, దీనికి నిరసనగా వామపక్ష ఎంపీలు ఆందోళన చేస్తున్న క్రమంలో వారిని అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు. యాత్రకు మంచి స్పందన రావడంతో పాటు ప్రజలు పెద్దఎత్తున కదిలారని యాత్ర విజయవంతానికి సహకరించిన ప్రజలు మేధావులు, మీడియా వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.
మహిళ 33 శాతం రిజర్వేషన్ ఎక్కడీ:
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లు లక్ష్మి
మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఎక్కడని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లు లక్ష్మి ప్రశ్నించారు. గ్యాస్ సిలిండర్, నిత్యావసరాల ధరలను పెంచి మహిళలను ఇబ్బంది పెడుతున్న బీజేపీి ప్రభుత్వాన్ని గద్దె దింపాలని కోరారు.మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.మహిళల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారని నిరసన వ్యక్తం చేశారు. వారికి చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లును తొక్కి పెడుతున్నారని. విమర్శించారు.
బీజేపీి ప్రభుత్వాన్ని గద్దె దింపాలి : సీపీిఐ జిల్లా కార్యవర్గ సభ్యులో లోడంగి శ్రవణ్ కుమార్
దేశ ఆస్తులను అప్పనంగా అంబానీ, ఆదానీలకు తెగనమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు లోడంగి శ్రవణ్‌కుమార్ అన్నారు. చేశారు. దేశ ప్రజల మీద అనేక రకాల పన్నులు విధిస్తూ నిత్యావసర ధరలను విపరీతంగా పెంచుతున్నారని బీజేపీని గద్దెనింపాలని కోరారు.
ప్రశ్నించే వారిని జైలు పాలు చేస్తున్నారు: కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోకల దేవాదాసు
ప్రశ్నించే వారిపై నిర్భందాలు పెంచి తమ ప్రభుత్వ లోపాలను కప్పి పుచ్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రేస్ నేత రాహూల్ గాంధీ పార్లమెంట్ లో ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు ఆయన పార్లమెంటరీ రద్దు చేయడం , ఎక్కడో చిన్న వాక్య పలికినందుకు జైలు పాలు చేయడం విడ్డురంగా ఉందని పేర్కొన్నారు. తక్షణమే బిజెపిని చిత్తుగా ఓడించాలని కోరారు.