Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి
నవతెలంగాణ- భువనగిరిరూరల్
ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఆయన 54 ఫిర్యాదులను స్వీకరించారు. రెవిన్యూ శాఖ 41, మున్సిపాలిటీ 4, పంచాయితీ శాఖ 2, ఎస్సి కార్పోరేషన్ 2, రోడ్లు భవనాలు, ఫారెస్టు, ఉపాధి కల్పన, మైనింగ్ శాఖ, నీటిపారుదల శాఖ ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. ఈ ప్రజావాణి కార్యమంలో కలెక్టరేట్ పరిపాలన అధికారి ఎం.నాగేశ్వరచారి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.