Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ ఛైర్మన్ వెన్రెడ్డి రాజు
నవతెలంగాణ-చౌటుప్పల్
విద్య, గ్రామాల అభివృద్ధికి దివీస్ పరిశ్రమ కృషి ఎంతో అభినందనీయమని మున్సిపల్ ఛైర్మన్ వెన్రెడ్డి రాజు అన్నారు. సోమవారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని బీసీ కాలనీలోని ప్రాథమిక పాఠశాల, మున్సిపల్ పరిధిలోని లక్కారం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు దివీస్ పరిశ్రమ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత హెల్త్ క్యాంపును ఆయన ప్రారంభించారు. నోట్ బుక్స్, వాటర్ బాటిళ్లు, హార్లిక్స్ ప్యాకెట్లు, స్కూల్ బ్యాగులు, షఉ, సాక్స్ లను విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బొడిగె అరుణబాలకృష్ణగౌడ్, దివీస్ సీఎస్ఆర్ ఇన్ఛార్జీ వల్లూరి వెంకటరాజు, జి.వెంకటేశ్వర్లు, సాయికృష్ణ, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.