Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్
నవతెలంగాణ- ఆలేరుటౌన్
దేశవ్యాప్తంగా మతోన్మాద బీజేపీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ , సిపిఐఎం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను సంగటిత పరిచేందుకే జన చైతన్య బస్సు యాత్ర చేపట్టడం జరిగిందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ అన్నారు. బస్సు యాత్ర విజయవంతం చేయాలని కోరుతూ సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన బస్సు యాత్ర సన్నాహక సమావేశంలో హాజరై మాట్లాడుతూ 8 ఏండ్ల కాలంలో బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుండి అనుసరిస్తున్న తప్పుడు విధానాలు, కారుపోరేట్ విష సంస్కృతి, మతోన్మాద రాజకీయాలకు పాల్పడుతూ ప్రజలను గందరగోళ పరుస్తుంది అన్నారు. దేశ సంపదను ధనవంతులకు దోచిపెడుతున్నది, నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్నారు. బీజేపీి విధానాలను ప్రతిఘటిస్తూ ప్రజలలోకి వెళ్లి ప్రచారం నిర్వహిస్తూ రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో కేంద్ర కమిటీ పిలుపుమేరకు మూడు చోట్ల నుండి బస్సు యాత్రలు ప్రారంభమయ్యాయన్నారు. అదిలాబాద్ నుండి ప్రారంభమైన జన చైతన్య బస్సు యాత్ర నేడు ఉదయం 9 గంటలకు ఆలేరు పట్టణానికి ప్రవేశిస్తుందన్నారు. పార్టీ శ్రేణులు సుమారు 200 మంది బస్సు యాత్రకు ఘన స్వాగతం పలకనున్నరన్నారు. ఆలేరు పట్టణ శివారు నుండి ఆలేరు పట్టణంలో సైకిల్ మోటార్లపై ప్రదర్శన నిర్వహించనున్నట్టు తెలిపారు. ఆలేరు పట్టణం నుండి తిరిగి 11 గంటలకు ర్యాలీగా భువనగిరి పట్టణం రైల్వే స్టేషన్ వరకు చేరుకుంటుందన్నారు. మహా ప్రదర్శన ప్రారంభమవుతుందన్నారు. ఆ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో
పార్టీ కార్యాలయం గ్రౌండ్లో బహిరంగ సభ నిర్వహించనున్నట్టు తెలిపారు. పార్టీ శ్రేణులు, ప్రజలు బహిరంగ సభ పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు, కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్.వీరయ్య, పార్టీ సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి, నంద్యాల నరసింహారెడ్డి, భువనగిరి శాసనసభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరవుతారని అన్నారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగాడుతూ బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఏకమై, రాబోయే ఎన్నికలలో ఓడించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు గౌడ్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత
ప్రజలపై పన్నుల భారం మోపుతూ పేదలను మరింత పేదలుగా మార్చుతుందన్నారు. కార్పొరేట్ శక్తులకు వత్తాసు పలుకుతూ దేశ సంపదను అప్పనంగా దోచిపెడుతుందన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దుంపల మల్లారెడ్డి స్మారక ట్రస్ట్ భవనం నిర్మాణం పూర్తయిందని, భవన ప్రారంభంతోపాటు ,జనచైతన్య యాత్ర బహిరంగ సభకు పార్టీ శ్రేణులు, ప్రజలు, ప్రజాతంత్ర వాదులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఆ పార్టీ పట్టణ, మండల కార్యదర్శులు ఎంఏ ఇక్బాల్, దుప్పటి వెంకటేష్, సీనియర్ నాయకులు మొరిగాడి రమేష్, ఘనగాని మల్లేష్, డీవైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ నాయకులు చేన్న రాజేష్, కాసుల నరేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
భువనగిరి :యాదాద్రి భువనగిరి జిల్లాలో సీపీఐ(ఎం) జనచైతన్య యాత్ర ను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి .జహంగీర్ విజ్ఞప్తి చేశారు. సోమవారం జనచైతన్య సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆ పార్టీ చేపట్టిన జనచైతన్య యాత్ర నేడు మంగళవారం ఉదయం 11.00 గంటలకు భువనగిరి రైల్వే స్టేషన్ చేరుకుంటుందన్నారు.. అక్కడి నుండి సిపిఐ(ఎం) జిల్లా కార్యాలయం వరకు భారీ ర్యాలీ ఉంటుందన్నారు.తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటయోధుడు, అమరజీవి దుంపల మల్లారెడ్డి పేరున నూతనంగా నిర్మించిన స్మారక భవనం ప్రారంభోత్సవం ఉంటుందని తెలిపారు అనంతరం సుందరయ్య భవనం ఆఫీస్ గ్రౌండ్ లో బహిరంగంగసభ జరుగనున్నదన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి, ప్రారంభకులుగా సిపిఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బి.వి రాఘవులు , స్థానిక ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి , కేంద్ర కమిటి సభ్యులు చెరుపల్లి సీతారాములు , రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, యాత్ర రథసారధి ఎస్ వీరయ్య , మిర్యాలగూడెం మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి , నల్లగొండ మాజీ శాసనసభ్యులు నంద్యాల నర్సింహారెడ్డి పాల్గొంటున్నారని తెలిపారు.