Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ ఎస్.వెంకట్రావు
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
ఎఫ్‌సీఐ నింబధనలను పాటిస్తూ జిల్లాలోని మిల్లర్లుకు కేటాయించిన కస్టమ్ మిల్లింగ్ రైస్ లక్ష్యాన్ని సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు ఆదేశించారు.సోమవారం జిల్లా కలెక్టరేట్లో ఎఫ్‌సీఐ,అధికారులు, మిల్లర్లతో నిర్వహించిన సమావేశంలో సీఎంఆర్ ఆలస్యానికి గల కారణాలను మిల్లర్లను అడిగి తెలుసుకున్నారు.జిల్లాలో గోడౌన్ల కొరత, టాన్స్‌పోర్టు సమస్యలతో సీఎంఆర్ ఆలస్యం అవుతుందని కలెక్టర్ దష్టికి తీసుకొచ్చారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మిల్లర్లు సీఎంఆర్ లక్ష్యాలను సకాలంలో సాధించలేక పోతున్నారని, కొంతమంది మిల్లర్లు వలన మిగతావారు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. మిల్లర్లు సీఎంఆర్ నిబంధనలు పాటిస్తూ సకాలంలో బియ్యం అందించాలన్నారు.జిల్లాలో వరి ధాన్యం అధికంగా ఉన్నందున బియ్యం కోసం ప్రత్యేక గోడౌన్ ఏర్పాటు చేసి దిగుమతి ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.మిల్లర్లు, ఎఫ్‌సీఐ అధికారులు సమన్వయంతో పనిచేసి సీిఎంఆర్ లక్ష్యం పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ యస్ మోహన్‌రావు, ఎఫ్‌సిఐ డివిజనల్ మేనేజర్ వరుణ్ సుద్, మేనేజర్ వాగ్యనాయక్, డిఎం సివిల్ సప్లరు రాంపతి, సూర్యాపేట రైస్‌మిల్లుల అధ్యక్షులు ఇమ్మడి సోమనర్సయ్య, మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.