Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జన చైతన్య యాత్ర సారధి ఎస్.వీరయ్య
- ఘనంగా స్వాగతం పలికిన ఎర్రదండు
నవతెలంగాణ -ఆలేరుటౌన్
ప్రజల సంక్షేమం, సమస్యల పరిష్కారం, సామాజిక న్యాయం కోసమే సీపీఐ(ఎం) జాతీయ కమిటీ పిలుపుమేరకు, రాష్ట్రవ్యాప్తంగా మూడు బృందాలుగా జనచైతన్య యాత్ర సాగుతుందని జన చైతన్య యాత్ర బృందం రథసారధి ఎస్.వీరయ్య అన్నారు. జనచైతన్య యాత్ర మంగళవారం ఆలేరు నియోజకవర్గ కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆ పార్టీ శ్రేణులు, పట్టణ ప్రజలు, ప్రజా సంఘాలు, సీపీిఐ ,ఇతర పార్టీ నాయకులు ఘనంగా యాత్రబృందం సభ్యులకు ఘనంగా స్వాగతం పలికారు. మహాత్మా గాంధీ డాక్టర్ బిఆర్.అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి యాత్ర బృందం నివాళులర్పించారు. 200 మోటార్ సైకిళ్లపై పట్టణంలో వైయస్సార్ గార్డెన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎర్రజెండాలు పట్టణమంతా రెపరెపలాడాయి. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వీరయ్య మాట్లాడుతూ సీపీఐ(ఎం) చేపట్టిన జనచైతన్య యాత్ర ఎన్నికల యాత్ర కాదని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న యాత్ర అన్నారు. బీజేపీ తొమ్మిదేండ్ల పాలనలో ప్రజా సమస్యలు జటిలంగా మారాయన్నారు. పెరిగిన నిత్యావసర ధరలతో ప్రజలపై మరింత భారం మోపబడింది అన్నారు. మహిళలకు భద్రత కరువైందన్నారు. బీజేపీ ప్రభుత్వం ఆదాని, అంబానీలకు మాత్రమే రాయితీలు ఇస్తూ, ప్రజలపై పన్నుల భారం మోపుతోందని చెప్పారు. ప్రపంచ చరిత్రలోనే కానీ, విని ఎరుగని రీతిలో రైతులు దేశ రాజధాని ఢిల్లీని చుట్టూ ముట్టి రైతు సమస్యలపై ఆందోళన చేశారని గుర్తు చేశారు. ప్రజల మధ్య మతపరమైన చిచ్చు పెట్టి, భావోద్వేగాలని రెచ్చగొట్టి బీజేపీ ప్రభుత్వం పబ్బం గడుపుకుంటుందన్నారు. బీజేపీ విధానాలను ప్రజలకు తెలియజేసేందుకే బస్సు యాత్ర చేపట్టిందన్నారు. గంగానది ప్రక్షాళనకు రూ.20వేల కోట్లు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం యాదాద్రి భువనగిరి జిల్లాలో గత ఎన్నికల హామీలో భాగంగా , గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణం, మూసి ప్రక్షాళన చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని బీబీనగర్ వద్ద నిర్మాణం చేసిన నిమ్స్ ను, ఎయిమ్స్ గా మార్చి ప్రజలకు సంపూర్ణ వైద్యం అందించడం లేదని, వైద్యం కోసం హైదరాబాద్ వెళ్లాల్సిన దుస్థితి నెలకొందన్నారు. బీజేపీి ఎన్నికల హామీ హైదరాబాదు నుండి రాయగిరి వరకు వెంటనే ఎంఎంటీఎస్ ప్రారంభించాలని ,నిధులు కేంద్రం మంజూరు చేయాలని డిమాండ్చేశారు. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 50 కేంద్రాల్లో భూ పోరాటాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. 2022 డిసెంబర్ 31వ తేదీ వరకు దేశంలో ఇల్లు లేని మనిషి లేకుండా చేస్తామన్న నరేంద్ర మోడీ వాగ్దానం వెంటనే ఆమాలు చేయాలని తెలిపారు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 21 ఏ ప్రకారం గౌరవంగా జీవించే హక్కు ఉందని, ఆ హక్కులను బిజెపి ప్రభుత్వం కాలరాస్తుందని విమర్శించారు. మరో హామీ అయినా, నిర్బంధ ఉచిత విద్య దేశవ్యాప్తంగా హమాలు చేయాలని కోరారు. జన చైతన్య బస్సు యాత్ర విజయవంతని కృషిచేసిన ప్రతి కార్యకర్తకు కృతజ్ఞతలు తెలిపారు. బస్సు యాత్ర బృందం సభ్యులు ,ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఫైళ్ల ఆశయ , జయలక్ష్మి , టీ. స్కైలాబాబు, లెల్లల బాలకృష్ణ, జగదీశ్లను శాలువా పూలమాలలతో పార్టీ శ్రేణులు ఘనంగా సన్మానించారు. అనంతరం భువనగిరి సభా స్థలం వరకు 200 బైకులతో పార్టీ శ్రేణులు బస్సు యాత్ర బృందంతో కలిసి తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు గౌడ్, ఈ కార్యక్రమంలో జిల్లా రూట్ మ్యాప్ ఇన్చార్జి అనగంటి వెంకటేష్, బస్సు రూట్ మేనేజర్ బెల్లంకొండ వెంకటేష్,పట్టణ, మండల కార్యదర్శి ఎంఏ.ఇక్బాల్, దుపటి వెంకటేష్, వ్యవసాయ కార్మిక సంఘం, డీివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నాయకులు మొరుగాడి రమేష్, జూకంటి పౌల్ ,మొరిగాడి చంద్రశేఖర్, తాళ్లపల్లి గణేష్ ,బొమ్మ కంటి లక్ష్మీనారాయణ, ఘనగాని మల్లేష్, బుగ్గ నవీన్, చెన్నా రాజేష్, కాసుల నరేష్, ఎలుగల శివ, మంగ అరవింద్, వడ్డేమాన్ బాలరాజు, భువనగిరి గణేష్, వడ్డేమాన్ విప్లవ్, నల్ల మాస తులసయ్య, వాలి, పరశురాం,మొరిగాడి అశోక్,మిట్ట శంకరయ్య,సంగీ రాజు, మేకల బాలరాజు , భాస్కర్, ప్రశాంత్, బుగ్గ ప్రవీణ్,దయాకర్ సిపిఐఎం తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ మద్దతు
సీపీఐ(ఎం) జన చైతన్య యాత్ర బృందానికి మండల కేంద్రంలో మంగళవారం సీపీిఐ ్టమద్దతు తెలుపుతూ నాయకులు ఘన స్వాగతం పలికారు. బృంద సారధి వీరయ్యకు శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు చెక్క వెంకటేష్, అయిలి సత్తయ్య , కొల్లు రాజయ్య, చౌడబోయిన కనకయ్య, నాయకులు బొడ్డు ఆంజనేయులు, సిహెచ్ రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ(ఎం) జనచైతన్య యాత్రకు స్వాగతం పలికిన సీపీఐ నాయకులు
భువనగిరి రూరల్ :రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన సీపీఐ(ఎం) జన చైతన్య యాత్రలో భాగంగా మంగళవారం భువనగిరికి వచ్చిన బస్సు యాత్రకు నాయకత్వం వహిస్తున్న ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్. వీరయ్య కు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నాయకత్వం స్వాగతం పలికారు. పట్టణంలోని పాత బస్టాండ్ దగ్గర ఎస్ వీరయ్యకు సీపీిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏశాల అశోక్ పూలమాలవేసి స్వాగతం పలికారు. వామపక్షాల ఐక్యత వర్ధిల్లాలి అనే నినాదం మారుమోగింది ఉత్సాహపూరిత వాతావరణం కలిగింది. ఈ యాత్రకు స్వాగతం పలికిన వారిలో ఆ పార్టీ జిల్లా కౌన్సిల్ సభ్యులు వస్తూపుల అభిలాష్, సీపీఐ పట్టణ కార్యదర్శి పుట్ట రమేష్, సహాయ కార్యదర్శి చింతల మల్లేశం ఉన్నారు.
సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులుకు గొర్రె పిల్లను బహుకరించిన జీఎంపీఎస్ జిల్లా కమిటీ బృందం
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ మతోన్మాదం ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సీపీఐ(ఎం) జనచైతన్య యాత్ర బృందానికి జీఎంపీఎస్ జిల్లా కమిటీ పక్షాన రైల్వే స్టేషన్ వద్ద గొర్రెల కాపరులు గొంగడి భుజాన ధరించి వేషధారణతో ఘన స్వాగతం పలికారు. రైల్వే స్టేషన్ నుండి సీపీఐ(ఎం) కార్యాలయం వరకు జరిగిన ప్రజా ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పోలిట్ బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు గారికి గొంగడి,గొర్రె పిల్లను బహుకరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గొర్రెల మేకల పెంపకందారుల ప్రధాన సమస్యలైన మేత నీళ్లు వైద్యం బీమా ఎక్స్గ్రేషియా సమస్యల పరిష్కారం కోసం జరిగే పోరాటాలకు సిపిఎం పార్టీ సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దయ్యాల నరసింహ మద్దెపురం రాజు సహాయ కార్యదర్శిలు ఎల్లముల సత్యనారాయణ, కొండె శ్రీశైలం ఉపాధ్యక్షులు బుగ్గ చంద్రమౌళి, మద్దెపురం బాల నరసింహ,తంగేళ్ల చంద్రయ్య, పాక జహంగీర్, స్వామి, బుగ్గ నవీన్ పాల్గొన్నారు.