Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ పమేలా సత్పతి
నవతెలంగాణ- భువనగిరిరూరల్
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు ముందుకు వస్తున్న స్వచ్ఛంద సంస్థలు, దాతల సేవలు అభినందనీయమని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మంగళవారం యువ అన్ స్టాపబుల్, స్పందన స్ఫూర్తి స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో రాయగిరి ప్రభుత్వ పాఠశాలలో రూ.11 లక్షలతో చేసిన అభివృద్ధి పనులలో భాగంగా డిజిటల్ క్లాస్ రూమును కలెక్టర్ ప్రారంభించారు. పాఠశాలలో బాల బాలికలకు ప్రత్యేకంగా టాయిలెట్స్, డైనింగ్ షెడ్, వాష్ ఏరియా నల్లాల ఏర్పాటు, లైబ్రరీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యువ అన్ స్టాపబుల్, స్పందన స్ఫూర్తి స్వచ్ఛంద సంస్థలు జిల్లాలో రూ.86 లక్షలతో 6 ప్రభుత్వ పాఠశాలలు రాయగిరి, చొల్లేరు, ముత్తిరెడ్డిగూడెం అనంతారం, హన్మాపురి, భువనగిరి పాఠశాలు, 2 ప్రభుత్వ వసతి గృహాలలో మౌలిక వసతులు కల్పిస్తున్నందుకు యువ, స్పందన స్ఫూర్తి స్వచ్ఛంద సంస్థలను అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణరెడ్డి విద్యాశాఖ సెక్టోరియల్ అధికారి ఆండాలు, యువ అన్ స్టాపబుల్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్టు మేనేజర్లు ఆశిష్ పటేల్, సచిన్ యాదవ్, మహమ్మాద్ హస్సేన్, స్పందన స్ఫూర్తి స్వచ్ఛంద సంస్థ వైస్ ప్రెసిడెంట్ తమ్మినేని అమర్నాథ్, రాయగిరి ప్రభుత్వ పాఠశాల హెడ్మాస్టర్ రంగయ్య, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.