Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు
నవతెలంగాణ - రాజాపేట
కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీకి బలం, బలగమని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత ,మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు అన్నారు. మంగళవారం మండలంలోని రఘునాథపురం క్లస్టర్ లో ఏర్పాటు చేసిన బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్తులు, మహిళలు ప్రభుత్వ విప్‌కు డప్పు చప్పులతో స్వాగతం పలికారు. ఆమె గ్రామస్తులతో కలిసి భోనం ఎత్తి ర్యాలీగా సమావేశం ఏర్పాటు చేసిన ప్రయివేటు రిసార్ట్స్ వరకు వచ్చారు. గ్రామస్తులు ఆమెను గజ మాలతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం భారత దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు చేపట్టిన ఘనత కేసిఆర్‌కే దక్కిందని తెలియజేశారు .తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాలేశ్వరం ప్రాజెక్టు, మల్లన్నసాగర్ ,కొండపోచమ్మ లాంటి అనేక ప్రాజెక్టులు చేపట్టి ప్రతి ఎకరాకు సాగునీరు అందించిన ఘనత బీిఆర్‌ఎస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసిఆర్ కిట్టు ,ఆసరా పెన్షన్లు ,రైతులకు ఉచితంగా 24 గంటల కరెంటు, రైతు బీమా, రైతు బంధు, దళిత బంధు ,రైతు వేదికలు ,పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు వంటి అనేక సంక్షేమ పథకాలు చేపట్టి ప్రజలకు చేరువయ్యారని తెలియజేశారు. భారత దేశంలో బిఆర్ఎస్ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక కవితను ఈడి, సీబీఐ లాంటి రూపంలో వేధిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, మదర్ డైరీ డైరెక్టర్లు గాల్ రెడ్డి, గొల్లపల్లి రాంరెడ్డి ,ఎంపీపీ బాలమణి ,మండల పార్టీ అధ్యక్షులు నాగిర్తి రాజిరెడ్డి, కంచర్ల శ్రీనివాస్ రెడ్డి, సుమలత ,ముకుంద రెడ్డి ,నాయకులు తుంగ బాలు, సంధిలా భాస్కర్ గౌడ్, పల్లె సంతోష్ గౌడ్, స్థానిక సర్పంచ్ గాడి పల్లి శ్రవణ్, కటకం స్వామి, మహేందర్ , రాపోలు కవిత ,మోత్కుపల్లి ప్రవీణ్, మోత్కుపల్లి నవీన్, అన్ని గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు అధ్యక్ష ,కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.