Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- రామన్నపేట
మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో మిషన్ భగీరథ పైప్ లైన్ మంగళవారం సాయంత్రం లీకై మంచినీరు ప్రవహిస్తోంది. మండలంలో పక్షం లేదా నెల రోజులలో ఏదో ఒక చోట మిషన్ భగీరథ పైపులైను పగిలిపోవడమో, గేట్ వాల్ వద్ద లీక్ అవ్వడం జరుగుతూనే ఉంది. ఈ రెండు నెలల కాలంలో బస్టాండ్ సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద, అంబేద్కర్ చౌరస్తాలోని సత్తయ్య ఇంటి వద్ద, పెద్దమోరి సమీపంలో, లోతుకుంట క్రింది భాగంలో పళ్ళుమార్లు పైప్ లైన్ లీకేజీ అయ్యింది. పోలీస్ స్టేషన్ సమీపంలోని ప్రాంతంలో ఇప్పటికే ఐదుసార్లు పైప్లైన్ లీక్ అయి నీరు ఏరై పారుతూ వృథా అయ్యింది. మరమ్మతులు చేసిన అది అంతంత మాత్రమే ఉంటుంది. మిషన్ భగీరథ పైప్ లైన్ ఆశాంతం లోక భూయిష్టం, నాణ్యత లోపం కనిపిస్తోంది. కొన్నిచోట్ల ఇప్పటికే భూమిలోనుండి వేసిన ప్లాస్టిక్ పైప్లైన్ అక్కడక్కడ నేలపై తేలి కనిపిస్తోంది. దాని పైనుండి ఏ వాహనం పోయినా, అక్కడ ఎవరైనా చిన్న మంట లాంటిది పెట్టిన పైప్లైన్ ధ్వంసం కావడం ఖాయం. పట్టించుకునే నాధుడే లేడు.... సమస్యను గుర్తించి వెలుగెత్తి చాటితే నిందరోపణలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం అవుతుంది. ఇప్పటికైనా ఆ శాఖ ప్రభుత్వ అధికారులు స్పందించి ఎక్కడ పైపులైన్ బలహీనంగా ఉందో గుర్తించి శాశ్వత మరమ్మతులు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.