Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆలేరుటౌన్ :ఆలేరు పీఏసీఎస్ పరిధిలోని రైతులకు ఎరువుల సమస్య తలెత్తకుండా తగు చర్యలు తీసుకుంటున్నామని చైర్మెన్ మొగలగాని మల్లేశం అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం పిఎసిఎస్ కార్యాలయం ఆవరణలో డైరెక్టర్లతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన మూడు సంవత్సరాలలో క్రాఫ్ లోన్, బార్ల లోన్లు, వ్యక్తిగత లోన్లు, సొసైటీలకు లోన్లు ఒక కోటి 60 లక్షలు పంపిణీ చేశామన్నారు. శ రాజిపేట లో సొసైటీ తరఫున దాదాపు కోటి రూపాయల విలువైన భూమి కొనుగోలు చేయడం జరిగిందన్నారు. ఇక్కుర్తి , కొలనుపాక లో సొసైటీ భూములు పరిరక్షించామన్నారు. ఆలేరు పిఎసిఎస్ తో పాటు, కొల్లూరు, ఇ క్కుర్తి లలో ఫర్టిలైజర్ షాప్ లో ఏర్పాటు, కొలను పాక రైతు సంఘం ఆధ్వర్యంలో ఫర్టిలైజర్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 2021, 22 సంవత్సరాల గాను ధాన్యం కొనుగోలు ద్వారా సొసైటీకి దాదాపు 49 లక్షల రూపాయల పైచీలుకు ఆదాయం వచ్చినట్లు తెలిపారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గదపాక నాగరాజు, పిఎసిఎస్ సీఈవో ఇందూరి వెంకటరెడ్డి, డైరెక్టర్లు కట్టెగొమ్ముల సాగర్ రెడ్డి, ఆరె మల్లేశం, బిక్షపతి, సభ్యులు మామిడాల అంజయ్య, లక్ష్మి ,బాపురెడ్డి, సురేందర్ రెడ్డి,జూకంటి ఉప్పలయ్య, కుండే.సంపత్, వస్పర్ బాలయ్య సిబ్బంది పాల్గొన్నారు.