Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య
నవతెలంగాణ-పాలకవీడు
ప్రతినెలా గ్రామసభలను కచ్ఛితంగా నిర్వహించాలని, 100 శాతం పన్ను వసూలు చేసి, గ్రామ పంచాయతీ రిజిస్టర్లు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య పంచాయతీ కార్యదర్శు లకు సూచించారు.మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన స్వచ్ఛ భారత్ మిషన్-2లో బాగంగా సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, గ్రామసంఘాల సహాయకులకు నిర్వహిస్తున్న శిక్షణా శిబిరంలో పాల్గొని మాట్లాడారు.అన్ని గ్రామాలలో బహిరంగ మల విసర్జన జరుగకుండా చూడాలన్నారు.ఇప్పటికి గ్రామాలలో మరుగుదొడ్డి లేని కుటుంబాలను గుర్తించి,వారికి వెంటనే మంజూరు చేయించాలన్నారు.మండలంలో ఈ సంవత్సరం పన్నువసూలు వివరాలను అడిగి తెలుసుకున్నారు.వందశాతం పన్ను వసూలు చేసిన రావిపహడ్ పంచాయతీ కార్యదర్శిని అభినందించారు.మిగతా వారు కూడా ఈ నెల చివరి వరకు 100శాతం పన్ను వసూలు చేసి జమ చేయాలని కోరారు.అనంతరం మండలకేంద్రంలో పల్లె ప్రకృతివనాన్ని సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు.వేసవిలో చెట్లు చనిపోకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని, గ్రామ పంచాయతీ సిబ్బందికి జీతాలు సక్రమంగా చెల్లించాలని సూచించారు.గ్రామాలు పరిశుభ్రంగా,పచ్చదనంతో కళకళలాడేలా చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ పిన్నెల్లి ఉపేందర్‌రావు, ఎంపీటీసీలఫోరం మండల అధ్యక్షులు మీసాల ఉపేందర్, ఎంపీడీఓ వెంకటచారి, పంచాయతీ అధికారి దయాకర్, సర్పంచులు చెన్నబోయిన నర్సింహ,బోగల వీరారెడ్డి, ఏపీఓ రాజు, సిబ్బంది పాల్గొన్నారు.