Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ ఎస్.వెంకట్రావు
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళ ఆరోగ్య కార్యక్రమం జిల్లాలో పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అధికారులను ఆదేశించారు.మంగళవారం సూర్యాపేట పట్టణంలోని కుడకుడరోడ్డులోని బస్తీ దవాఖానను ఆయన తనిఖీ చేసి మాట్లాడారు.మహిళలకు అందిస్తున్న సేవలను పరిశీలించారు.ప్రతి మంగళవారం జిల్లాలో ఉన్న నిర్దేశించిన బస్తీ దవాఖాన ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలలో మహిళలు తమ ఆరోగ్య సమస్యలకు సేవలు పొంది సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని సూచించారు.దవాఖానకు వచ్చిన మహిళల ఆరోగ్యసమస్యలు తెలుసుకుని వారికి సేవలందించాలని వైద్యాధికారి, ఆరోగ్య సిబ్బందిని ఆదేశించారు.మహిళలందరూ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి క్యాన్సర్, బీపీ, షుగర్,గర్భాశయ వ్యాధులకు నిర్ణిత సమయంలో గుర్తించి చికిత్స పొందాలన్నారు.ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ కోటాచలం, సిబ్బంది పాల్గొన్నారు.