Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరేడుచర్ల
ఎడారి ప్రాంతానికే పరిమితమైన ఖర్జూర సాగు నేడు మన ప్రాంతంలో కూడా సాధ్యమేనని నిరూపించారు సూర్యా పేట జిల్లానేరేడుచర్ల పట్టణం శాంతి నగర్‌కు చెందిన బానోతు శ్రీనివాస్ నాయక్. తైవాన్ జామ, ఖర్జూర కలిపి మిశ్రమ పంటగా 1.07 గుంటల భూమిలో సాగు చేశారు.2019లో నాటిన 100 ఖర్జూర మొక్కల పంట నాలుగేండ్ల తర్వాత పిందెలు వేసి కాయలు కాయడం ప్రారంభించింది. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న ఖర్జూర, తైవాన్ జాములు స్థానికంగా పండించడం ఎంతో సంతోషకరంగా ఉందని శ్రీనివాస్‌నాయక్ చెప్పారు. ఆర్గానిక్ పద్ధతిలో సాగు చేస్తున్న తైవాన్ జామ నాలుగేండ్లుగా ఏడాదికి రెండు దఫాలుగా దిగుబడి వచ్చిందనీ రైతులు ఒకే పంట సాగు చేయకుండా ఈ విధంగా పంటల వైవిధ్యీకరణ చేయడం ఎంతో ముఖ్యమని వ్యవసాయ విస్తరణ అధికారి బుడిగం నాగరాజు అన్నారు.