Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-సూర్యాపేట
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు,కార్మిక,వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ మార్చి 31 నుండి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు జిల్లావ్యాప్తంగా చలో ఢిల్లీ విజయవంతం కోసం జరిగే ప్రచారజాతాను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు కోరారు.బుధవారం స్థానిక సీఐటీయూ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సీఐటీయూ, రైతుసంఘం, వ్యవసాయ కార్మికసంఘం ఆధ్వర్యంలో జరిగిన జాయింట్ సమావేశంలో ఆయన మాట్లాడారు.కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు తను చేసిన ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నిలబెట్టుకోలేక పోయిందన్నారు.ఏడాదికి కోటి ఉద్యోగాలని ప్రైవేటీకరణ పేరుతో లక్షలాది ఉద్యోగాలను ఊడగొట్టారని, నల్లధనం వెలికితీత పేరుతో నోట్లను రద్దు చేసిన బీజేపీ ప్రభుత్వం అంతకంటే పెద్ద నోట్లను ముద్రించి అవినీతికి పెద్దఎత్తున తెర లేపిందని విమర్శించారు. అనేక దశాబ్దాల పాటు గ్రామీణ పేదలు పోరాడి సాధించుకున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీచట్టాన్ని నిర్వీర్యం చేసే భాగంగా ప్రతి ఏటా బడ్జెట్లో నిధుల్ని పెద్దఎత్తున తగ్గిస్తున్నదన్నారు.ఈ ప్రభుత్వానికి నిలదీయడం కోసం ఏప్రిల్ 5న ఢిల్లీలో జరిగే నిరసన కార్యక్రమానికి పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో వ్యవసాయ కార్మికసంఘం జిల్లా కార్యదర్శి మట్టిపల్లిసైదులు, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు రాంబాబు, రైతుసంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కొప్పుల రజిత, కందాల శంకర్రెడ్డి, శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్ చెరుకు ఏకలక్ష్మీ పాల్గొన్నారు.