Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మద్దిరాల
రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమపథకాలు దేశానికి ఆదర్శమని ఎమ్మెల్యే గాదరికిశోర్‌కుమార్ అన్నారు.బుధవారం మండలకేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు,రైతుబంధు జిల్లా సమితి కోఆర్డినేటర్ ఎస్ఏ.రజాక్ అధ్యక్షతన నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేనివిధంగా అనేక సంక్షేమ పథకాల అమలవు తున్నాయన్నారు.రాష్ట్రం అని, రైతులకు 24 గంటల ఉ చిత విద్యుత్తు, రైతు బీమా, రైతుబంధు, రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ.10వేలు, మహిళలకు కల్యాణలక్ష్మీ,ఒంటరి మహిళకు ఆసరా పెన్షన్, కేసీఆర్ కిట్టు, మిషన్ భగీరథ నీళ్లు, కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా తుంగతుర్తి నియోజకవర్గానికి సాగునీటితో పాటు ఇంకా అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణమాత్రమేనన్నారు.మద్దిరాల నూతన మండలాన్ని ఏర్పాటు చేసి అన్ని రంగాల్లో ఈ అభివద్ధి చేశానన్నారు.మళ్లీ ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో మూడోసారి గెలిపించాలని కోరారు.బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, మహిళలు బతుకమ్మలతో, బోనాలతో, కోలాటాలు, డప్పు దరువుల సందడితో, పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ గుజ్జదీపికాయుగంధర్‌రావు, ఎంపీపీ గుడ్ల ఉపేంద్ర, వెంకన్న, జెడ్పీటీసీ కన్నా సూరంభవీరన్నగౌడ్, సర్పంచుల ఫోరం మండలఅధ్యక్షుడు కుందూరు విష్ణువర్ధన్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ ఆకుల ఉప్పలయ్య, జిల్లా గ్రంథాలయ డైరెక్టర్ దుగ్యాల రవీందర్రావు, రైతు బంధు సమితి జిల్లాకమిటీ సభ్యులు మల్లు కపోతంరెడ్డి, ప్రధాన కార్యదర్శి నర్సింహ, వైస్‌ఎంపీపీ బెజ్జంకి శ్రీరాంరెడ్డి, తుంగతుర్తి మార్కెట్ మాజీ వైస్‌చైర్మెన్ కోడి శ్రీనివాస్ పాల్గొన్నారు.