Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేధిస్తున్న సిబ్బంది కొరత
- కనీస సౌకర్యాలు కనుమరుగు
- కాలిపోయిన ఫ్యాన్లు
నవతెలంగాణ-పెద్దవూర
పల్లెసీమలే దేశానికి పట్టుకొమ్మలు.. అలాంటి పల్లెల్లో జీవనం సాగిస్తున్న ప్రజలు అనారోగ్యానికి గురైతే వైద్యం సేసి సరైన మందులు అందించేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. పెద్దవూరమండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో సౌకర్యాలు లేక, సిబ్బంది లేక వెలవెలబోతుంది.
కనీస సౌకర్యాలు కనుమరుగు
ఆస్పత్రిలో కనీస సౌకర్యాలు తాగు నీళ్లు, మూత్రశాలులు, మరుగుదొడ్ల వంటి సౌకర్యాలు లేక అందులో పనిచేసే సిబ్బందికి కూడా ఇబ్బందులు తప్పడం లేదు. ఆస్పత్రికి వచ్చిన రోగులు టాబ్లెట్ వేసుకుందామన్నా చుక్క నీళ్లు దొరకవు. అక్కడ విధులు నిర్వహించే సిబ్బంది బాటిళ్లల్లో నీళ్లు తెచ్చుకుంటారు. వేసవికాలం కావడం దాహం తీర్చుకోనుటకు గంట గంటకు సెంటర్కు వెళ్లడం జరుగుతుంది. దాంతో వైద్యం సక్రమంగా అందడం లేదు. మెయింటినెన్సు నిధులు వస్తూన్నా చిన్న చిన్న సమస్యలు పరిష్కారం కావడం లేదు..అన్ని నిధులను స్వాహా చేస్తున్నారు. దీంతో కనీస సౌకర్యాలకు నిధులు లేక ఏడు ఫ్యాన్లు వున్నా రెండు మాత్రమే పని చేస్తున్నాయి. వేసవికాలం ఆస్పత్రికి వచ్చిన రోగులు కొద్దిసేపు కూడా ఉండలేని పరిస్థితి దాపురించింది.
శిథిలావస్థకు చేరిన ఆస్పత్రి
భవనం శిథిలా వస్థలో ఉండి ఎప్పుడు కూలుతుందో తెలియని దుస్థితి నెలకొంది. వర్షాకాలంలో ఆస్పత్రి లోపల అంతట నీళ్లు గోడల వెంబడి కారి ఆస్పత్రి గోడలకు కరెంట్ షాక్ సరఫరా అవుతుంది. దీంతో సిబ్బంది భయం భయంగా డ్యూటీలు చేయాలసివస్తుంది. ఒకే ఒక్క వైద్యుడు ఉంటే కనీస సౌకర్యాలు ఉండవు, సిబ్బంది ఉండరు. ఈ రెండు ఉంటే అన్నిరకాల మందులు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. నూతనంగా వచ్చిన డాక్టర్ నగేష్ ఆస్పత్రికి రోజు వస్తున్నా సిబ్బంది కొరత వేధిస్తోంది. ఉదయం10 నుంచి సాయింత్రం 5 గంటల వరకే కేంద్రంలో ఉంటున్న సౌకర్యాలు లేక వైద్యం కోసం రోగులు సమీపంలోని పట్టణానికి పరుగులు తీయాల్సిన పరిస్థితి నెలకొంది. ఆస్పత్రి ఆవరణలో పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా ఉన్నా కనీస సౌకర్యాలు లేవు. పెద్దవూర మండలంలో 42 వేలమంది జనాభా ఉండగా అందులో దళిత, గిరిజన
గ్రామాల వారే ఎక్కువగా ఉన్నారు. ఆరు హాస్టళ్లు కూడా ఉన్నాయి. పాఠశాల విద్యార్థులు కూడా ఎక్కువగా వస్తుంటారు. ఈ ఆస్పత్రికి గతంలో రోజుకు 100 మందికి పైగా రోగులు వచ్చేవారు. కానీ ప్రస్తుతం సిబ్బంది కొరతతో రోజుకు 40 మంది కూడా రాని పరిస్థితి ఏర్పడింది. రాత్రి వేళల్లో
మాత్రం ఎవరూ ఉండరు. ఒక స్వీపర్ మాత్రం అక్కడే కాపలాగా ఉంటాడు.
సిబ్బంది కొరత
ప్రస్తుతం అన్ని విధాల రోగులకు మందులు ఉన్నాయని, కుక్క కాటుకు, పాము కాటుకు మందులు అందుబాటులో ఉన్నాయని డాక్టర్ నగేష్ పేర్కొన్నారు. ఆస్పత్రిలో ఫస్టు ఎఎన్ఎం లు ఆరుగురికి నలుగురు, సెకండ్ ఎఎన్ఎంలు ఐదుగురికి ముగ్గురు, తర్డు ఏఎన్ఎంలు ఐదుగురికి ముగ్గురు వున్నారు. ఫార్మాసిస్ట్ లేక సంవత్సరంపైగా అయింది. సీనియర్ అసిస్టెంట్, యూడీసీ నల్లగొండకే పరిమితమయ్యారు. ఆస్పత్రికి రాక మూడు నెలలు దాటింది. ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది.
విధులు నిర్వర్తించేది వీరే
ఏఎన్ఎంలు, నలుగురు సెకండ్ ఏఎన్ఎంలు ముగ్గురు, సూపర్ వైజర్లు ముగ్గురు మాత్రమే వున్నారు. డీపీఎంఓ, ఏపీఎంఓ,సెకండు గ్రేడ్ ఫార్మాసిస్ట్, ఎంపీహెచ్ఎస్ (02), స్టాఫ్ నర్స్ ఒకరు
ఎన్హెచ్ఎన్ ఒకరు మొత్తం 13 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇద్దరు స్టాఫ్ నర్సులు, ఒక హెల్త్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నిషియన్, డాక్టర్ విధులు నిర్వహిస్తున్నారు. కుక్కకాటుకీ తప్ప పాముకాటు వ్యాక్సిన్ అందుబాటులో లేదు. దీని కోసం 21 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగార్జున
సాగర్ ఏరియా ఆస్పత్రికి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఇప్పుడు ఎండలు దంచి కొడుతున్నాయి. సీజనల్ జ్వరాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైనా ఆస్పత్రిలో కనీస సౌకర్యాలు పూర్తి స్థాయిలో సిబ్బందిని ఏర్పాటు చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.
అద్వాన్నంగా సబ్ సెంటర్ల పరిస్థితి
మండలంలో 10 సబ్ సెంటర్లు ఉన్నాయి. కానీ ఆ సబ్ సెంటర్లో కొందరు ఏఎన్ఎంలు మినహా సబ్ సెంటర్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. దాంతో వైద్య సేవలు అంతంతమాత్రమే జరుగుతున్నాయని ఆయా గ్రామ ప్రజలు వాపోతున్నారు. టీకాలు వేసేటప్పుడు, వ్యాక్సిన్ వేసేటప్పుఫు మాత్రమే సబ్ సెంటర్లలో ఏఎన్ఎంలు కనిపిస్తారని, మిగితాసమయాల్లో కొన్ని సబ్ సెంటర్లు మినహా మిగితావన్ని ఖాళీగా ఉంటున్నాయని ఆరోపణలు వస్తున్నాయి.
ఫాన్లు వేస్తే గోడలకు షాక్ వస్తుంది
డాక్టర్ నగేష్ (పెద్దవూర)
ఫ్యాన్లు వేస్తే గోడలకు షాక్ వస్తుంది. ఆస్పత్రిలో 13 సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. యూడీసి సాగర్, నల్లగొండ, పెద్దవూరకు ఒక్కరే అప్పుడవుపుడు వస్తుంటారు. వచ్చేనెలలో ఖాళీలు పిలప్ చేస్తామని ఉన్నతాధికారులు చెప్పారు. తాగునీళ్లు ఏర్పాటు చెస్తాం. మెయింటెనెన్స్ నిదులు ఎంత ఇస్తున్నారో తెలియదు. నేను వచ్చి మూడు నెలలు అవుతుంది. నాకేమి తెలియదు.
గతంలో మెయింటెనెన్స్ నిధులు రెండులక్షలు ఇచ్చేవారు
డాక్టర్ కొండల్రావు (డీఎంహెచ్ఓ)
2013-14లో ఆస్పత్రికి రెండు లక్షలు మెయింటినెన్స్ నిధులు ఇచ్చేవారు. ఇప్పుడు సగానికి పైగా తాగించారు. 2017-18 నుంచి రూ.87,500 లు ఇస్తున్నారు. ఇవి డీిఎంహెచ్ఓ అకౌంట్ నుండి పీహెచ్సీ అకౌంట్లోకి బదిలీ చేస్తారు. హాస్పిటల్ సిబ్బంది అంత సంతకం చేస్తేనే డబ్బులు ఇస్తారు. రోగులకు తాగునీళ్లు, సదుపాయాలు ఏర్పాటు చేస్తాం.