Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నీలగిరి అభివద్ధి
- రూ.1,500 కోట్ల తో పనులు
- ఒక్క జిల్లాకేంద్రానికే రూ.900 కోట్లు మంజూరు
- కేసీఆర్ దత్తతతోనే నల్లగొండ శస్యశ్యామలం
- త్వరలోనే జిల్లాకు ఐటి కొలువులు
సబ్బండ వర్గాల ప్రజల పట్ల ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ప్రత్యేక దష్టిఉమ్మడి రాష్ట్రంలో దశాబ్దాల తరబడి తీవ్ర వెనుకబాటుకు గురైన నియోజకవర్గం నల్లగొండ. గత 20 సంవత్సరాల నుండి పట్టించుకునే పాలకుల్లేక, అభివద్ధికి సరిపడా నిధులు లేకపోవడంతో నీలగిరి అభివద్ధి చెందడంలో కుంటుపడింది. పట్టణంలో ఇరుకు రోడ్లు, అధ్వానమైన డ్ర్రెయినేజీ వ్యవస్థ, కరువైన మౌలిక వసతులతో అనేక సమస్యలు ప్రజలను వేధించేవి. ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ప్రత్యేక చొరవతో నాలుగేండ్లలోనే నల్లగొండ రూపురేఖలు మారాయి.
నవతెలంగాణ -నల్గొండ
దశాబ్దాల నాటి దారిద్య్రం వీడి నల్లగొండ కొత్త వెలుగులు ప్రసరిస్తున్నాయి. కేవలం నాలుగేండ్లలోనే దాదాపు రూ.1,500 కోట్ల అభివద్ధి సాధ్యమైంది. నల్లగొండ ను దత్తత తీసుకున్న సీఎం కేసీఆర్ రూ.900 కోట్లు కేటాయిచడంతో శరవేగంగా పట్టణాభివద్ధి జరుగుతున్నది. ఇప్పటికే మంజూరైన రూ.716.77 కోట్లతో జిల్లాకేంద్రం రహదారులు విశాలంగా మారాయి. ప్రధాన వీధుల్లో జంక్షన్లు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. సమీకత మార్కెట్ , మినీ పార్కులతో పట్టణం కలకలలాడుతుంది. జిల్లా కేంద్రంతో పాటు మరోవైపు నియోజకవర్గంలోని నల్లగొండ, కనగల్, తిప్పర్తి, మాడుగులపల్లి మండలాల్లోనూ అభివద్ధి కొనసాగుతుంది.
రూ.1500 కోట్లతో నియోజకవర్గ అభివద్ధి...
20 ఏండ్లు ఒకే వ్యక్తి ఆధీనంలో ఉన్న నల్లగొండ నియోజకవర్గం వెనుకబాటుకు గురికాగా కెేసీిఆర్ దత్తత తీసుకున్న నల్లగొండను నాలుగేళ్లలోనే ప్రగతి పథంలో పయనిస్తున్నది. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ప్రత్యేక చొరవ చూపడంతో జిల్లా కేంద్రం మరింత అభివద్ధి బాట పట్టింది. 15 వందల కోట్లతో నియోజకవర్గం అన్ని రంగాల్లో దూసుకుపోతున్నది. ప్రధానంగా నీలగిరి పట్టణం రూ.900 కోట్లతో అత్యంత సుందరంగా రూపుదిద్దుకుంటున్నది. రూ.50 కోట్లతో ఐటీ హబ్ నిర్మాణం చేపడుతున్నారు.36 కోట్లతో ఎన్జీ కళాశాల ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. నియోజకవర్గంలోని 73 గ్రామ పంచాయతీల్లో దాదాపు వంద కోట్లతో పలు అభివద్ధి పనులకు పునాది వేశారు.
జిల్లా కేంద్ర ఆస్పత్రికి మరిన్ని నిధులు
పేదలకు ప్రభుత్వ వైద్యం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర సర్కారు నల్లగొండ జనరల్ ఆస్పత్రిని 250 పడకల నుంచి 550 పడకలకు విస్తరించింది. దీంతోపాటు దవాఖానలో అధునాతన పరికరాలు సమకూర్చడం, వైద్యుల కేటాయింపుతో పేదలకు వైద్యం చేరువైంది. డయాలసిస్ కేంద్రం, పది పడకలతో పాలీ కేర్ క్యాన్సర్ యూనిట్, పిల్లల కోసం 12 పడకలతో ఐసీయూ, రెండు ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసి 550 పడకలకు ఆక్సిజన్ అందేలా ఏర్పాటు చేశారు. రక్త పరీక్ష నుంచి సిటి స్కాన్ వరకు ఇక్కడే ఉచితంగా చేస్తున్నారు.
మెడికల్ కళాశాల భవనం కోసం రూ 251 కోట్లు.. ...
నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి జిల్లా కేంద్రానికి మెడికల్ కళాశాల మంజూరు చేయించారు. ఈ మెడికల్ కళాశాలలో ప్రస్తుతం బ్యాచ్‌కు 150 మంది చొప్పున నాలుగు బ్యాచ్‌ల్లో 600 మంది విద్యార్థులు పలు కోర్సుల్లో వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. రూ 251 కోట్లతో మెడికల్ కళాశాల భవనం ప్రస్తుతం పట్టణంలోని ఎస్ఎల్బీసీ సమీపంలో శరవేగంగా పనులు కొనసాగుతున్నాయి.
అభివద్ధి చేసి రాష్ట్రానికి నియోజకవర్గాన్ని రోల్ మోడల్ గా అందిస్తా......
ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
నల్లగొండ నియోజకవర్గంలో 20 ఏండ్లలో జరుగని అభివద్ధి ఈ నాలుగేండ్లలోనే చేసి చూపించాను. నల్లగొండను మరో సిరిసిల్ల, సిద్దిపేటలా అభివద్ధి చేసి రాష్ట్రానికి రోల్‌మోడల్‌గా అందించడమే నా లక్ష్యం.నల్లగొండ పట్టణ అభివద్ధికి ప్రభుత్వం రూ.900 కోట్లు కేటాయించగా.. ఇప్పటి వరకు రూ.716.77 కోట్లు మంజూరయ్యాయి.నల్లగొండ, తిప్పర్తి, కనగల్ మండలాల్లో ఎస్డీఎఫ్ నిధులతో తొలి దశలో రూ.33 కోట్లు, మలి దశలో రూ.19.30 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం.ఎన్ఆర్ఈజీఎస్ నిధులు మరో రూ.30 కోట్లతో రోడ్ల నిర్మాణం పనులు జరుగుతున్నాయి. మూడు మండలాల్లోని 73 గ్రామ పంచాయతీల్లో రూ.19.80 కోట్లతో ట్రాక్టర్ల కొనుగోలు, డంపింగ్ యార్డులు, సెగ్రిగేషన్ షెడ్లు, పల్లె ప్రకతి వనాలు, వైకుంఠ ధామాలు, రైతు వేదికల నిర్మాణంప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణానికి రూ.251 కోట్లు కేటాయించగా పనులు జరుగుతున్నాయి . నల్లగొండలో రూ.50 కోట్లతో ఐటీ టవర్ నిర్మాణ పనులు పూర్తి కావస్తుంది. రూ.36 కోట్లతో నాగార్జున కళాశాలను అధునాతన వసతులతో నిర్మాణం జరుగుతుంది. ఉదయ సముద్రం ట్యాంక్‌బండ్‌కు రూ.75 కోట్లు మంజూరునల్లగొండ పట్టణంలో క్లాక్‌టవర్ సెంటర్ నుంచి మర్రిగూడ బైపాస్ వరకు రోడ్డు, జంక్షన్లు, సెంట్రల్ లైటింగ్ పనులు పూర్తయ్యాయి.మున్సిపల్, రాజీవ్ పార్కుల ఆధునీకరణ, కొత్తగా చేపట్టిన అర్బన్ పార్కు, మినీ పార్కుల నిర్మాణాలు పూర్తయ్యాయి.కేశరాజుపల్లి నుంచి దుప్పలపల్లి వరకు రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి.తిప్పర్తి మండలంలోని మామిడాల గ్రామంలో వాగుపై రూ.4కోట్లతో బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
నల్లగొండను రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం
నియోజకవర్గ ప్రజలు గతంలో ఒకే వ్యక్తికి రెండు దశాబ్దాల పాటు అవకాశం ఇచ్చినా ఈ ప్రాంతాన్ని పట్టించుకోక పోవడంతో అభివద్ధిలో వెనుకబడింది. నేను ఎమ్మెల్యే అయ్యాక ఇప్పటి వరకు నల్లగొండ అభివద్ధికి ప్రభుత్వం నుంచి సుమారు రూ.15 వందల కోట్లు తీసుకొచ్చాను. నల్లగొండ పట్టణ అభివద్ధికి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో రూ.900 కోట్లు మంజూరు చేయించా. ఇందులో ఇప్పటికే రూ.716 కోట్లు విడుదల కాగా.. పలు అభివద్ధి పనులు చేపట్టాం. మరికొన్ని జరుగుతున్నాయి. త్వరలోనే పట్టణం పూర్తి స్థాయిలో అందంగా ముస్తాబవుతుంది. సెంట్రల్ లైటింగ్ సిస్టమ్‌తో పట్టణమంతా రాత్రి పూట జిగేల్మనేలా ప్లాన్ చేశాం. అదేవిధంగా నల్లగొండ, కనగల్, తిప్పర్తి మండలాల్లోని 73 గ్రామ పంచాయతీలు, వాటి పరిధిలోని ఆవాసాల అభివద్ధికి పల్లె ప్రగతి, ఎస్డీఎఫ్, ఉపాధి హామీ నుంచి రూ.100కోట్లకు పైగా వెచ్చించి సీసీ రోడ్లు, వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డులు, పల్లె ప్రకతి వనాల నిర్మాణం చేశాం. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో నల్లగొండకు ఐటీ హబ్, మెడికల్ కళాశాల తీసుకొచ్చాను. 20 ఏండ్లలో జరుగని అభివద్ధి ఈ నాలుగేండ్లలోనే చేసి చూపించాం.
పల్లెలు గ్రామ స్వరాజ్యానికి పునాదులు...
దోమలపల్లి మల్లేష్ (అనంతరం)
నల్లగొండ నియోజక వర్గంలోని పల్లెలు గ్రామ స్వరాజ్యానికి నేడు పునాదులు గా ఉన్నాయి. గతంలో పాలకుల నిర్లక్ష్యం మూలంగా పారిశుద్ధ్యం అస్తవస్తంగా తయారయింది. నేడు కెేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు రోజు తప్పి రోజు వీధులను ఊడ్చడంతో పాటు మురుగు కాల్వలను శుభ్రం చేస్తున్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకతి వనాలు పార్కులను తలపిస్తున్నాయి. గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలు పెద్దవి కావడంతో పచ్చని వాతావరణం నెలకొంది.
గ్రామీణ రోడ్లకు మహర్దశ....
పెరిక సహదేవ్( మామిల్లగూడెం)
నియోజకవర్గంలోని అన్ని గ్రామీణ రోడ్లకు మహర్దశ వచ్చింది. గతంలో గ్రామాలలో కొద్దిపాటి చినుకులు పడిన వీధులన్నీ జలమయం అయ్యేవి. రాత్రిపూట రోడ్లమీద ప్రయాణించాలన్న జంక్ పుట్టేది. రాష్ట్రంలో కెసిఆర్ రెండవసారి అధికారంలోకి వచ్చాక కంచర్ల భూపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన నాటినుండి గ్రామాలలోని రోడ్లన్నీ బాగుపడ్డాయి. గ్రామ సమస్యలు తీర్చిన సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి రుణపడి ఉంటాం.
ట్రాఫిక్ సమస్య తీరింది
బొంతల శంకర్( నల్లగొండ)
జిల్లా సెంటర్‌గా ఉండడంతో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. దీంతో రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. దీంతో పట్టణంలో ట్రాఫిక్ సమస్య తీరింది. మరి గూడ బైపాస్ నుండి గడియారం సెంటర్ వరకు, మనందరికీ బస్టాండ్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు, కలెక్టర్ కార్యాలయం నుండి మిర్యాలగూడ రోడ్డు నాలుగు లైన్ల రోడ్డు పనులు జరుగుతున్నాయి. పట్టణంలో గుంతలమయంగా ఉన్న రోడ్లకు మరమ్మతులు చేశారు. హరితహారంలో భాగంగా పార్కులను అభివద్ధి చేయడంతోపాటు డివైడర్ల మధ్య నాటిన మొక్కలు ప్రస్తుతం ఏపుగా పెరగడంతో పచ్చదనం పరుచుకున్నది. పట్టణంలోని ప్రధాన రోడ్లకు ఇరువైపులా గోడలకు వేసిన బతుకమ్మ, రాష్ట్ర చిహ్నాలు, ప్లాస్టిక్ నివారణ వంటి సందేశాత్మక చిత్రాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి