Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆకాశమంత గాలిగోపురం
- మహాభారతం, రామాయణం యుద్ధ విశేషాలు కన్పించే శిల్పాలు
- ఏర్పాట్లు పూర్తి -సర్పంచ్ కనకటిసునీత వెంకన్న
నవతెలంగాణ-నూతనకల్
రెండవ భద్రాద్రిగా పేరుగాంచిన కలిగిన మండలపరిధిలోని మిర్యాల సీతారామచంద్రస్వామి దేవాలయం భక్తుల కోరికలు తీర్చే గొప్ప ఆధ్యాత్మిక దేవాలయంగా విరాజిల్లుతుంది.గత పాలకుల నిర్లక్ష్యం వల్ల మరుగునపడ్డ ఆలయ ప్రతిష్ఠ వైభవం ప్రజాదారణ స్వరాష్ట్ర పాలనలో నూతన జిల్లాలో అభివద్ధికి పురుడు పోసుకుంది.మూడేండ్ల కింద అప్పటి కలెక్టర్ సురేంద్రమోహన్ సుమారు రూ.11.95లక్షలు కేటాయించి ఆలయం చుట్టూ సీసీ రోడ్డునిర్మాణం, ఆలయంలో గదుల పునర్నిర్మాణం చేయడంతో ఆలయ పరిసరాలు అందంగా కనిపిస్తున్నాయి.ఇప్పుడు పూర్వ వైభవానికి సిద్ధమవుతుంది. శ్రీరామనవమి సందర్భంగా పది రోజుల పాటు ఈ ఆలయంలో ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.ఈ కల్యాణమహోత్సవానికి సూర్యాపేట, నల్లగొండ, ఖమ్మం, వరంగల్,మహబూబాద్ జిల్లాల నుండి వేలాదిగా భక్తులు ఆలయాన్ని చేరుకుంటారు.
ఆలయ విశిష్టత :
పూర్వం ఈ ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది.శ్రీ రాముడు కైకేయి కోరిక మేరకు అయోధ్యను వదలి సీతాలక్ష్మణ సమేతంగా అరణ్యవాసానికి వెళ్తుండగా ప్రస్తుత ఆలయ ప్రాంగణంలో కొంతసేపు సేద తీరాలని ప్రచారంలో ఉంది. అందువల్ల ఎక్కడ సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని నిర్మించామని స్థానికులు చెబుతున్నారు.ఆలయ నిర్మాణం జరిగినప్పటి నుండి ఇప్పటివరకు ప్రతిఏడాది శ్రీరామనవమి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు.ఈ ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా నిర్వహించే ధ్వజారోహణం సందర్భంగా వేసి గరుడ ముద్దను ఆరగించిన మహిళలకు సంతానప్రాప్తి కలుగుతుందని, భక్తులు వెంటనే కోరికలు తీరుతాయని వారి నమ్మకం.
ప్రత్యేక ఆకర్షణగా గాలిగోపురం
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలలోనేఎత్తైన గాలిగోపురాలలో ఒక్కటైన ఈ గోపురం 1942లో కాస రంగయ్య నిర్మించిన ఈ ఆలయంలో గొప్ప శిల్పకళా సంపద ఉంది.52 అడుగుల ఎత్తు కలిగి ఉన్న భారీ గాలిగోపురం ఈ ఆలయ విశిష్టత చెప్పుకుంటున్నారు.గాలిగోపురంపై రామాయణం, మహాభారతం ఇతివత్తాలను యుద్ధాలు చేసే సంఘటనలను తెలియజేసే శిల్పకళను కలిగిన ఉండడం ఈ గాలి గోపురం యొక్క ప్రత్యేకత.కోనేరు1942వ సంవత్సరంలో ఆలయానికి చెందిన కోనేరును దాదాపు 50 అడుగుల లోతు రాతి కట్టడంతో మెట్లు కట్టారు.అందులో ఇప్పటికీ నీరు ఉండడం విశేషం.
కల్యాణమహోత్సవానికి ఏర్పాట్లు పూర్తి
అలయ కమిటీ చైర్మెన్- కనకటి పల్ల వెంకన్న
సుమారు ఆరు జిల్లాల నుండి వచ్చే భక్తులకు అన్ని మౌలిక సౌకర్యాలను కల్పిస్తూ ఏర్పాట్లను పూర్తి చేశాం.అధికసంఖ్యలో భక్తులు పాల్గొని కల్యాణ మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.
పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి
ఉపసర్పంచ్-మన్నెం రమేష్
ఆలయ అభివద్ధికి ప్రభుత్వం సహకరించి, కల్యాణమహోత్సవం, పట్టు వస్త్రాలను ప్రభుత్వం అధికారికంగా అందించాలి. ఎంతో పేరు ప్రఖ్యాతలు కలిగిన గొప్ప ఆధ్యాత్మికకేంద్రంగా పేరుగాంచిన మిరియాల సీతారామచంద్రస్వామి ఆలయం పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి. గతం కంటే వైభవంగా సర్పంచ్ కనకటి సునీత వెంకన్న, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్ సహకారంతో రెండవ భద్రాద్రిగా పేరు ప్రతిష్టలు కలిగిన సీతారామచంద్రస్వామి వివాహ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.ఈ ఆలయంలో కోరిన వారికి కోరికలు తీరుతాయని నమ్మకం భక్తుల్లో ఉంది.ఈ ఆలయాన్ని మరింత అభివద్ధి చేసి ఆలయానికి వచ్చే భక్తులకు వసతులు కల్పిస్తే మరింత అభివద్ధి చెందే అవకాశం ఉంది.కాబట్టి ప్రభుత్వ అధికారులు స్పందించి అభివద్ధికి సహకరించాలని కోరారు.