Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -రామన్నపేట
కేంద్రంలో ఉన్న బిజేపి ప్రభుత్వం అవలంబించే కార్మిక, రైతు, కూలీ వ్యతిరేక విధానాలు నిరసిస్తూ దేశ రాజదాని డిల్లీలో లక్షలాది మందితో నిర్వహించే మహా దర్నా పోస్టర్ ను గురువారం మండల కేంద్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కన్వినర్ గొరిగె సోములు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం అధికాలోకి వచ్చాక కార్మిక, రైతు, కూలీ బ్రతుకులు దుర్భరంగా మారాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నూతన లెబర్ కొడ్ అమలు చేస్తూ రైతు చట్టాలతో, ఉపాది హామి పథకానికి నిధుల తగ్గింపుతో ప్రభుత్వం దేశ ప్రజల పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రభుత్వ ఆస్తులను ఆదాని-అంబానీలకు తాకట్టుపెట్టి దేశ ప్రజా సంపదను దుర్వినియోగపరుస్తున్నారని ఆయన ఆరోపించారు. రాజ్యాంగ సంస్థల ద్వారా ప్రతిపక్షాలపై ఈడీ, ఐటి దాడులు చెయిస్తూ ప్రజాస్వామ్యాన్ని అభాస పాలు చేస్తున్నారన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అవలంబించే ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఎప్రిల్ 5న నిర్వహించే చలో డిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చెయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటీయూ నాయకులు వంగాల మారయ్య, నకిరెకంటి రాము, జుంపాల మహేష్, నకరికంటి రాము, బందెల భిక్షం, మహేష్, నూనె అంజయ్య, గొరిగి మల్లేష్, నల్ల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.