Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పూజలు చేసిన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి
నవతెలంగాణ - భువనగిరి
యాదాద్రి భువనగిరి జిల్లాలోని పలు దేవాలయాలలో గ్రామాలలో అంగరంగ వైభవంగా సీతారామ కల్యాణ మహోత్సవం గురువారం వేద పండితుల మంత్రోత్సలతో ఘనంగా నిర్వహించారు. శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి విగ్రహాలను డప్పు వాయిద్యాలతో ఊరేగింపులు నిర్వహించారు. జిల్లాలోని యాదాద్రి, బసవలింగేశ్వర స్వామి, అక్కన్న మాదన్న దేవాలయం, సుంకీ శాల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, వేములకొండ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం, జిల్లా కేంద్రంలోని దేవాలయాలలో ప్రత్యేక విద్యుత్, మంఢప అలంకరణలతో నిర్వహించారు. ఈ సందర్భంగ పలు దేవాలయాల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించడంతో పాటు ప్రసాదము అందజేశారు. బెల్లం తో తయారు చేసిన ప్రత్యేక పానకములు భక్తులకు అందజేశారు .
ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి
భువనగిరి పట్టణంలో 17వ వార్డులో గల కన్యకా పరమేశ్వరి ఆలయంలో,1వ వార్డులో ,15 వార్డు అర్బన్ కాలనీలో జరుగుతున్న సీతారామ కల్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సుబ్బూరు బీరుమల్లయ్య, మార్కెట్ కమిటీ చైర్మెన్్ రాజేందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు ఏవి కిరణ్ కుమార్, రాజు, ఆ యా వార్డు పాల్గొన్నారు.
ఆలేరురూరల్ : ఆలేరు మండలం కొల్లూరు గ్రామంలో శ్రీరామనవమి కల్యాణ మహోత్సవంలో జనగాం దంపతులు పూజా కార్యక్రమంలో పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు .ఈ కార్యక్రమంలో టీపీసీ రాష్ట్ర కార్యదర్శి ఉపేందర్ రెడ్డి ,మాజీ సర్పంచ్ శంకరయ్య ,మాజీ పాల సెంటర్ చైర్మన్ దశరథ ,గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీ పాల్ రెడ్డి ,గణేష్ ,బిక్షపతి, మహిళలు భక్తులు తదితరులు పాల్గొన్నారు.
భువనగిరి రూరల్ : శ్రీరామ నవమి సందర్భంగా భువనగిరి మండలం అనంతరం గ్రామంలో రామాలయం వద్ద నిర్వహించిన సీతారాముల కల్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి కుటుంబ సమేతంగా స్వామివారి కల్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బస్వాపురం గ్రామంలో భువనగిరి ఎంపీపీ నారాల నిర్మల వెంకటస్వామి యాదవ్, సర్పంచ్ కస్తూరి మంజుల శ్రీశైలం, ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో సర్పంచ్ మాకోలు సత్యం యాదవ్, వడ పర్తి గ్రామంలో ఎలిమినేటి కృష్ణారెడ్డి, తిమ్మాపురం గ్రామంలో సర్పంచ్ పిన్నం లతా రాజు, ఎంపీటీసీ ఉడుత శారద ఆంజనేయులు యాదవ్, సింగల్ ఎండ మాజీ చైర్మన్ ఎడ్ల సత్తిరెడ్డి, నాగిరెడ్డిపల్లి గ్రామంలో సర్పంచ్ జాక్క రాఘవేందర్ రెడ్డి, నందనం గ్రామంలో సర్పంచ్ కడమంచి ప్రభాకర్, ఎంపీటీసీ మట్ట పారిజాత శంకర్ బాబు, నమాత పెల్లి గ్రామంలో ఎల్లంల శాలిని జంగయ్య యాదవ్,చందుపట్ల గ్రామంలో సర్పంచ్ చిన్నం పాండు, ఎంపీటీసీ కొండల్ రెడ్డి, మాజీ చైర్మన్ బాల్గురి మధుసూదన్ రెడ్డి, వీరవెల్లి గ్రామంలో సర్పంచ్ తంగళ్ళపల్లి కల్పనా శ్రీనివాసచారి, ఎంపీటీసీ కంచి లలితా మల్లయ్య, చీమల కొండూరు గ్రామంలో సర్పంచ్ జీలుగు కవిత సతీష్ పవన్, కునూరు గ్రామంలో సర్పంచ్ ఆ%శీ%కర్ల మురళీకృష్ణ, ఎంపీటీసీ పాశం శివానంద్, కాంగ్రెస్ జిల్లా నాయకులు నుచ్చు నాగయ్య యాదవ్, కేసారం గ్రామంలో సర్పంచ్ పోతుల కృష్ణ యాదవ్, హనుమాపురం గ్రామంలో సర్పంచ్ ఎడ్ల సత్తిరెడ్డి, వైస్ ఎంపీపీ ఏనుగు సంజీవరెడ్డి, తుక్కాపూర్ గ్రామంలో సర్పంచ్ నోముల పద్మ మహేందర్ రెడ్డి, ఎంపీటీసీ రాసాల మల్లేష్ యాదవ్, బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు జనగం పాండు, మాజీ సర్పంచ్ పుట్ట అరుణ వీరేష్ యాదవ్, బొల్లెపల్లి గ్రామంలో సర్పంచ్ మద్ది బుచ్చిరెడ్డి, ఎంపీటీసీ గడ్డమీది చంద్రకళ వీరస్వామి గౌడ్ , గౌస్ నగర్ లో సర్పంచ్ ఈర్లా పుష్పమ్మ, సిరివెనీకుంట సర్పంచ్ పడాల అనిత వెంకటేష్, మండల వ్యాప్తంగా గ్రామ గ్రామంలో ఘనంగా సీతారాముల కల్యాణ మహౌత్సవాలు భక్తులు నిర్వహించారు. ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కళ్యాణ మహౌత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. స్వచ్ఛంద సంస్థల యువజన సంఘాలు భక్త భజన మండలి ఆధ్వర్యంలో మండల వ్యాప్తంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించగా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో చిన్నం శ్రీనివాస్, వెంట పకీరు కొండల్ రెడ్డి, చిగురుపల్లి సోమయ్య, మాజీ సర్పంచ్ పల్లెపాటి హరిబాబు, వల్లపు విజరు, ఏలిటి రఘు,శ్రీపతి నరేష్,సమల చందు, గుద శ్రీశైలం,కావడి నవీన్, బండిరాల వెంకటేష్,ఎలక కిష్టయ్య, బండిరల మహేష్,శ్రీరాం యూత్ సభ్యులు పాల్గొన్నారు.
ఆలేరుటౌన్ : మండల కేంద్రంలో గురువారం పట్టణంలోని రెడ్డిగూడెం వద్ద రామాలయంలో అర్చకులచే , శ్రీ సీతారాముల కళ్యాణం లో కట్కూరి లక్ష్మి నరేందర్ రెడ్డి, మల్ రెడ్డి సాంబిరెడ్డి దంపతులు, పోచమ్మ తల్లి దేవాలయం వద్ద, శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణం పట్టణ ప్రధాన అర్చకులు ఆలేటి రంగన్న పంతులు ఆధ్వర్యంలో భక్తుల సమక్షంలో అత్యంత వైభవంగా కళ్యాణం పై కూర్చున్న దంపతులు ఎలుగల స్వర్ణలత, కుమారస్వామి, గాడిపెల్లి కవితా కృష్ణమూర్తి, నమిలే కవితా నరసింహులు, ఎలగల స్వర్ణలత కుమారస్వామి, వారాల రజిత శ్రీధర్ దంపతులు కూర్చున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
సాయి గూడెం వద్ద పిఎసిఎస్ వైస్ చైర్మన్ చింతకింది చంద్రకళ మురహరి కళ్యాణంలో పాల్గొన్నారు. శివాలయంలో అర్చకులు వేదాటి సత్యనారాయణ శాస్త్రి ఆధ్వర్యంలో,
రంగనాయకుల వీధి ఆంజనేయస్వామి ఆలయం వద్ద, శ్రీ కనకదుర్గ ఆలయం వద్ద,శ్రీ సంతోషిమాత ఆలయం వద్ద, బహుదూర్ పేటలో అంగరంగ వైభవంగా ఆలయ అర్చకులు శ్రీ సీతారాముల కళ్యాణం భక్తుల సమక్షంలో నిర్వహించారు.పానకం, వడపప్పు నైవేద్యంగా సమర్పించి భక్తులకు పంచారు.
ఈ కార్యక్రమం లో మాజీ జెడ్పిటిసి బోట్ల పరమేశ్వర్, బోట్ల విశ్వేశ్వర్, సబ్బన్ సుభాష్, బండ శ్రీనివాస్, పాశికంటి శ్రీనివాస్, పత్తి వెంకటేష్, దయ్యాల సంపత్, ఆలేటి అజరు,బోడపాట్ల రాజు, కే. హేలేందర్, తిరుపతి పాల్గొన్నారు. కనకదుర్గ మాత ఆలయంలో వాసవి పరపతి సంఘము ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారామచంద్రస్వామికళ్యాణము నిర్వహించడం నిర్వహించారు. అనంతరం అన్నదానం చేశౄరు..ఈకార్యక్రమంలో వాసవి పరపతి సంఘము అధ్యక్షులు ఐడియా శ్రీను, ప్రధాన కార్యదర్శి సారాబ్ సంతోష్, అయిత వెంకటేష్, చోలేటి కనక భూషణం, బెలదే సంతోష్ ,పొద్దుటూరి మల్లికార్జున్, పద్మ కృష్ణ, వైశ్య సంఘము నాయకులు పసుపునురి వీరేశం, గార్లపాటి శ్రీనివాస్, చోలేటి నాగయ్య ,చోలేటి ప్రకాష్, గందె అంజయ్య ,గంప కృష్ణ,నాగబండి జగదీష్, బహదూర్ పేటలో కూల మంగమ్మ వెంకటేష్, అక్కిరెడ్డి భవాని కృష్ణ, కుండే సంపత్, కూల సిద్దులు,కుల నరసింహులు,
తదితరులు పాల్గొన్నారు.
రాజాపేట: మండల కేంద్రంలోని గడి కోట లో గల రాములోరి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా రాజవంశీయులు వజ్రెందర్ రావు సాధన దంపతులు, శ్రీలత భూపాల్ ఆధ్వర్యంలో గురువారం కళ్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం కళ్యాణానికి విచ్చేసిన భక్తులందరికీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజాపేట మాజీ సర్పంచ్ ఉట్కూరి భాగ్యలక్ష్మి, అశోక్ గౌడ్ , ఆడెపు శ్రీను దంపతులు స్థానిక ఎస్సై శ్రీనివాస్ రెడ్డి కాకల ఉపేందర్, సట్టు తిరుమలేష్, జస్వంత్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
వలిగొండ రూరల్: మండలంలోని వెంకటాపురం లో గల శ్రీ మత్స్యగిరి ఆలయంలోని రామమందిరంలో ,కంచనపల్లిలో, సంగెం, వర్కట్ పల్లి, దాసిరెడ్డి గూడెం లో,నాతాళ్లగూడెం, నరసాపురంలో, గోకారం(చింతపూవుబండ), వెల్వర్తిలోని ఆలయాలలో శ్రీ రామనవమి పురస్కరించుకొని కొలువైన శ్రీ సీతారామచెంద్ర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా వేదమంత్రోచ్చారణల మధ్య, మంగళ వాయిద్యాల మధ్య వేదపండితులు కళ్యాణ తంతు ఘనంగా నిర్వహించారు.మండలంలోని వర్కట్ పల్లిలో బిజెపి రాష్ట్ర నాయకులు గూడూరు నారాయణ రెడ్డి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.స్వామివారి కల్యాణానికి 1లక్షా 116 వేల రూపాయల విరాళం ఆలయ కమిటీ సభ్యులకు అందజేసారు. అనంతరం వివిధ గ్రామాలలో ఆలయాలవద్ద భక్తులకు దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జెడ్పి ఛైర్మెన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, మాజీ మంత్రి ఎలిమినేటి ఉమా మాధవ రెడ్డి,ఎంపిపి నూతి రమేష్, వైస్ ఎంపీపీ బాతరాజు ఉమా బాల్ నరసింహ, సర్పంచ్ లు కీసరి రాంరెడ్డి, కొమురెల్లి సరిత సంజీవరెడ్డి, ఉలిపె మల్లేశం, మీసాల శేఖర్, కొత్త నరసింహ, ఎంపిటిసిలు, ఆలయ కమిటీ సభ్యులు, కార్య నిర్వాహణ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట రూరల్ : యాదగిరిగుట్ట మండలం మైలర్ గూడెం గ్రామంలో గురువారం శ్రీ రామ నవమి సందర్భంగా స్వామి వారి కళ్యాణంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి,ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి బీర్ల అయిలయ్య దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలేరు నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
బొమ్మలరామారం : శ్రీరామ నవమిని పురస్కరించుకొని మండల కేంద్రంలోని పలు గ్రామాలలో హనుమాన్,రామాలయాలు ముస్తాబయ్యాయి. ఉదయాన్నే రామ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. కొన్ని చోట్ల శోభ యాత్రలు నిర్వహించారు. శ్రీరాములవారి కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
రామన్నపేట :సీతారాములోరి కల్యాణ మహోత్సవం మండల వ్యాప్తంగా గ్రామ గ్రామాన ప్రజలు, భక్తులు భక్తిశ్రద్ధలతో రంగ రంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం అన్నదాన చేశారు. మండల కేంద్రంలోని చెన్నకేశవస్వామి ఆలయం, పెరమాండ్ల ఆంజనేయస్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణ మహౌత్సవం ఘనంగా నిర్వహించారు. మండలంలోని సిరిపురం గ్రామంలో నిర్వహించిన సీతారాముల కల్యాణ మహోత్సవానికి జడ్పిటిసి ఉన్న లక్ష్మీ జగన్మోహన్, గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ బడుగు రమేష్ పాల్గొనగా, మండలంలోని నీర్నెముల గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా శివ రామాంజనేయ ఆలయంలో బేతోజు సత్యనారాయణ శాస్త్రి ఆధ్వర్యంలో నిర్వహించిన సీతారాముల కల్యాణ మహోత్సవంలో గ్రామ వాస్తవ్యులు బోడుప్పల్ 22వ వార్డు కార్పొరేటర్ దొంతరబోయిన మహేశ్వరి కృపా సాగర్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించగా వైస్ ఎంపిపి నాగటి ఉపేందర్, సర్పంచ్ ముత్యాల సుజాతరవి, నిధాన్ పల్లి గ్రామంలో నిర్వహించిన కల్యాణంలో సర్పంచ్ గుత్తా నరసింహారెడ్డి, బోగారం గ్రామంలో సర్పంచ్ అంతటి పద్మ రమేష్, ఎంపీటీసీ గోగు పద్మ సత్తయ్య, జనం పల్లి గ్రామంలో సర్పంచ్ రేఖ యాదయ్య పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.