Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
నవతెలంగాణ-హుజూర్నగర్
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు నుండి ఆ ప్రభుత్వం చేస్తున్న అనైతిక విధానాలను, కుట్రలను, మోసాలను దేశ ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో వారికి సరైన గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని నల్లగొండ పార్లమెంటు సభ్యుడు ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ భారతదేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన కుటుంబం నుండి రాజీవ్ గాంధీ వచ్చాడన్నారు. ఆ కుటుంబానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీపై తప్పుడు కేసులు పెట్టి జైలు శిక్ష పడే విధంగా చేసి పార్లమెంట్ నుండి బయటికి పంపించడం కుట్ర పూరితమైన మోసం అని ఆరోపించారు. దేశంలో ఉన్న ప్రతిపక్ష పార్లమెంటు సభ్యులు, ముఖ్యమంత్రులు, నాయకులు కేంద్ర ప్రభుత్వం రాహుల్ గాంధీపై తీసుకున్న చర్యను ముక్తకంఠంతో ఖండించిన కేంద్ర ప్రభుత్వ పెద్దలకు బుద్ధి రావడం లేదన్నారు. రాహుల్ గాంధీ జోడోయాత్రను చూసి ప్రధాని మోడీకి, బీజేపీ ప్రభుత్వానికి భయం పట్టుకుందని తెలిపారు. దానివల్లనే లేనిపోని ఆరోపణలు చేస్తూ రాహుల్ గాంధీ ప్రతిష్టను దిగజార్చడానికి బీజేపీ కుట్ర పన్నుతోందన్నారు. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి వారి భావ ప్రకటనను తెలియజేసుకునే స్వేచ్ఛ రాజ్యాంగం వారికి కల్పించిందన్నారు. రాజ్యాంగ సూత్రాలకు తూట్లు పొడుస్తూ బీజేపీ ప్రభుత్వం నేడు వ్యవహరిస్తుందన్నారు. అది ముమ్మాటికి రాజ్యాంగ ఉల్లంగానే అని ఆరోపించారు. లలిత్ మోడీ, నీరవ్ మోడీ, ఆదాని వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడినప్పటికీ వారిపై ఎటువంటి విచారణ ప్రభుత్వం చేయడం లేదని, కేవలం పనిగట్టుకొని ప్రతిపక్ష పార్టీల నాయకులపైన పార్లమెంటు సభ్యులపైన ఈడీ, సీబీఐ వంటి దాడులను చేసి భయభ్రాంతులకు గురి చేస్తుందని విమర్శించారు. ఈ సమావేశంలో పార్టీ పట్టణ కార్యదర్శి తన్నీరు మల్లికార్జున్, మంజు నాయక్, వంటిపురి శ్రీను, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
30 గజాల స్థలం కోసం 30 మంది పోలీసులు ఎస్సై వెళ్లాలా
ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి
మఠంపల్లి మండలంలోని యాతవాకిళ్ళ గ్రామంలో ఆ గ్రామ మాజీ సర్పంచ్ బుడుగు కాశయ్య ఆధీనంలో ఉన్న 30 గజాల స్థలం మీదికి బుధవారం మఠంపల్లి ఎస్సై , ఎమ్మార్వో 30 మంది పోలీసులతో జేసీబీ తీసుకొని వెళ్లాడన్నారు బీజేపీ తీసుకొని వెళ్లడంతో భయభ్రాంతులకు గురైన ఆయన భార్య బూడిగ సుజాతపురుగుల మందు తాగి ఆత్మ హత్యాయత్నానికి పాల్పడంతో ఆమెను హుజూర్నగర్ ఏరియా హాస్పిటల్ తరలించారు. గురువారం ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏరియా ఆసుపత్రికి వెళ్లి ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని ఆమెకు ధైర్యం చెప్పాడు. కలెక్టర్‌కు ఈ విషయమై ఫిర్యాదు చేస్తానన్నాడు. అనంతరం విలేకరులతో మాట్లాడారు మఠంపల్లి ఎస్ఐ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నాడన్నారు. స్థానిక ఎమ్మెల్యే సైదిరెడ్డి మఠంపల్లి రోడ్డులో ఉన్న 46 ఎకరాలు 100 కోట్ల విలువైన భూమిని ఆక్రమించుకున్నప్పటికీ అవేవీ రెవెన్యూ అధికారులు గానీ పోలీసుల గానే కనపడటం లేదన్నారు. పోలీస్ మరియు రెవెన్యూ అధికారులు తమ విధులను న్యాయంగా సక్రమంగా నిర్వహించాలన్నారు. ఏ ఒక రాజకీయ పార్టీకి తోకలాగా వ్యవహరించాల్సిన అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్ మంజు నాయక్ వంటి పులి శ్రీను బండి వెంకటి తదితరులు పాల్గొన్నారు.