Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తిరుమలగిరిసాగర్
మండల కేంద్రంలో శ్రీరామనవమి సందర్భంగా పీఏసీఎస్ డైరెక్టర్ ఆవుల నాసర్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర స్థాయిల పురుషుల ఇన్విటేషన్ కబడ్డీ పోటీలు బుధవారం రాత్రి ముగిశాయి. ఈ పొటీల్లో తొమ్మిది టీమ్లు పాల్గొన్నాయి. మొదటి విజేతగా యూనియన్ బ్యాంకు జట్టు నిలిచి రూ.50వేలు, రెండో విజేతగా ప్రకాశం జట్టు నిలిచి రూ.45వేలు, మూడో విజేతగా సాయిహాస్టల్ హైదరాబాద్ జట్టు నిలిచి రూ.40వేలు, నాలుగో విజేతగా సూర్యపేట జట్టు నిలిచి రూ.35వేలు, 5వ విజేతగా బాపట్ల నిలిచి రూ.30వేల ఆరో విజేతగా జ్యోతి క్లబ్ రంగారెడ్డి జట్టు నిలిచి రూ.25వేలు, ఏడో విజేతగా ఖమ్మంజట్టు నిలిచి 20వేలు, ఎనిమిదో విజేతగా హనుమ కొండ జట్టు నిలిచి రూ.15వేలు, తొమ్మిదో విజేతగా వైఆర్సీ తిరుమలగిరి జట్టు రూ.10 వేలు నగదును గెలుపొందాయి. విజేతలకు నగదు బహుమతులు సీల్డ్లను ఎమ్మెల్యే నోముల భగత్, సీఐ శంకర్రెడ్డి, దాతలు అందజేశారు. ఈ సందర్భంగా కబడ్డీ క్రీడ ఆర్గనైజర్ ఆవుల నాసర్రెడ్డి మాట్లాడుతూ ఇండియా కబడ్డీ కోచ్ జగ్ మోహన్, తెలంగాణ రాష్ట్ర ఒలంపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగదీశ్వర్యాదవ్, తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ ఎం.రవికుమార, తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ టెక్నికల్ కన్వీనర్ జే.చంద్రమోహన్గౌడ్తో తోపాటు దాతల సహకారంతోనే తెలంగాణ ,ఆంధ్ర రాష్ట్ర స్థాయిల పురుషుల ఇన్విటేషన్ కబడ్డీ పోటీలు నిర్వహించుకో గలిగామని వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.