Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేతపల్లి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో రాష్ట్రంలోని దేవాలయాల్లో సకల సౌకర్యాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. కేతపల్లి మండలం బండపాలెం గ్రామంలో శ్రీ సీత రామ చంద్ర స్వామి వారి కల్యాణ మహోత్సవానికి ముఖ్య అతిధిగా ఆయన హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 20 లక్షలతో సీసీ రోడ్ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం వచ్చే సంవత్సరం శ్రీ రామనవమి వరకు కల్యాణ మండపం ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే చిరుమర్తి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిరుమర్తి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మారం వెంకట్‌రెడ్డి, నకిరేకల్ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల ప్రదీప్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు బొప్పని స్వర్ణలత గ్రామ సర్పంచి వంగూరు జయమ్మ, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.