Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నకిరేకల్
జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణమే ఏర్పాటు చేయాలని అఖిలభారత రైతుకూలీ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్ డిమాండ్ చేశారు. గురువారం స్థానిక యానాల మల్లారెడ్డి స్మారక భవనంలో ఆ సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షులు జ్వాల వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి కోతలు మొదలు పెట్టారని, అన్ని గ్రామ పంచాయతీలలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. కొనుగోలు చేసిన వారంలోపు రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబటి చిరంజీవి, జిల్లా ఉపాధ్యక్షులు సిలువేరు జానయ్య, కోశాధికారి బిరెడ్డి సత్తిరెడ్డి, నాయకులు ముసుకు అనంతరెడ్డి, కల్లూరి అయోధ్య, పజ్జూరు ఉపేంద్ర, బూరుగు సత్తయ్య, దేవరకొండ జానీ, వెంకటేశం పాల్గొన్నారు.