Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -సంస్థాన్‌నారాయణపురం
మండలంలోని వెంకంబావి తండాలో గురువారం ఇండ్ల పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్్ ప్రమాదవశాత్తు పేలడంతో పెద్ద ఎత్తున మంటలు లేచాయి. విద్యుత్తు ఓవర్ లోడ్ వల్ల ట్రాన్స్ఫార్మర్ పేలి ఉంటుందని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్ నుంచి పోగలు వస్తున్నట్లు విద్యుత్ అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోకపోవడం వల్లే పేలిపోయినట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. పక్కనున్న ఇంటిపై ఆయిల్ చిల్లి పడినప్పటికీ ప్రమాదం నుంచి బయటపడినట్టు తెలిసింది.