Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరంగల్ డిక్లరేషన్ పగడ్బందీగా అమలు చేస్తాం
- టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య
నవతెలంగాణ- రామన్నపేట
దేశ, రాష్ట్ర ప్రజలు ప్రశాంతంగా ఉండాలన్న, పేదల అభ్యున్నతి జరగాలన్న, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఆదరించాలని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య కోరారు. శుక్రవారం మండల కేంద్రంలోని సంజీవయ్య నగర్, బీసీ కాలనీలలో హత్ సే హాత్ జూడో పాదయాత్ర స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రజలను మోసం చేశారన్నారు. నియోజకవర్గంలో డబుల్ బెడ్రూంలో ఇండ్ల ఊసే ఎత్తలేదు అన్నారు. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన తల్లి అని ఆమెను రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించాలన్నారు. రాహుల్ గాంధీ వరంగల్ లో చేసిన డిక్లరేషన్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలులో పెడుతుందన్నారు. ఏకకాలంలో రెండు లక్షల రూపాయల పంట రుణ మాఫీ, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సాల్వే ర్ అశోక్, పట్టణ అధ్యక్షులు ఎండి జమీరుద్దీన్, బోయపల్లి మల్లేశం, మండల కిసాన్ సేల్ అధ్యక్షులు మొహమ్మద్ ఎజాస్, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు గురుకు శివ, మండల పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు సంగిశెట్టి బాబు, మండల కాంగ్రెస్ నాయకులు అయ్యాడం నర్సిరెడ్డి, నంగునూరు యాదయ్య, నోముల లింగస్వామి, మహేశ్వరం అశోక్, మొహమ్మద్ సలీం, గాదె నరసింహ, మొహమ్మద్ ఇంతియాజ్, నరసింహ, సోమయ్య, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.