Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉసేత్తని పాలకవర్గం
- ఒక్క రూపాయి కూడామడిగేలకు ఖర్చు చేయని వైనం
- దాతలు నిర్మించిన మడిగెలు శిథిలావస్థకు చేరువ
నవతెలంగాణ -వలిగొండ
మండల కేంద్రంలో మేజర్ గ్రామపంచాయతీలో మార్చి 27వ తేదీన వేలం పాటలు నిర్వహించగా వాయిదా పడ్డ విషయం తెలిసిందే. శుక్రవారం గ్రామపంచాయతీలో సమీక్షా సమావేశం నిర్వహించి ఏ తేదీన తిరిగి వేలం నిర్వహించాలో పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకుంటామన్న ఎంపీ మాట నీటి మూట లాగే మారింది. వాస్తవానికి మార్చి రెండవ వారంలోని వేలంపాటలు ముగిసి ఏప్రిల్ మొదటి తేదీ నుండి వేలం పాట దక్కించుకున్న వారికి అప్పజెప్పాల్సి ఉంది. ముచ్చటగా మూడోసారి వేలం పాటలు వాయిదా పడ్డప్పటికీ వసూలైన డబ్బుల్లో ఒక్క రూపాయి కూడా మడిగల అభివృద్ధికి ఖర్చు చేయకపోవడం విశేషం. నవంబర్ 2021 సంవత్సరం మధ్యలో అక్రమంగా వేసిన వేలంపాటలకు ముందు బాకీలు రూ.26 లక్షల గాను 17 లక్షల బాకీలు వదిలేసి మార్చి 2022న తిరిగి వేలం పటేల్ నిర్వహించారు. ఆ వేలం పాటలకు 33 మడిగెలకు గాను 30కి మొదటి డిపాజిట్ , ఇంటి పన్నులు దరఖాస్తు పన్ను మొత్తం కలిపి రూ.15 లక్షల పైన వసూలు చేశారు. వేలం పూర్తయిన తర్వాత అడ్డాలకు రిపేర్లు అనగా మీటర్లు ,బండలు, రేకులు, పెయింటింగ్ పూర్తి చేసి అప్పగిస్తామని తెలిపినప్పటికీ డబ్బులు ఖర్చు చేయకుండా ఆ నిధులన్నీ ఇష్టానుసారంగా వాడుకున్నారు. మడిగలు దక్కని వారికి ఇప్పటివరకు వాడుకున్న డిపాజిట్టు అందివ్వలేదు. దాత కుంభం అనిల్ కుమార్ రెడ్డి 17 మడిగలకు 15 లక్షలు వెచ్చించి అడ్డలు నిర్మించి గ్రామపంచాయతీకి అప్పజెప్పారు అప్పటినుండి ఇప్పటివరకు వాటిని అభివృద్ధి చేయడంలో పాలకవర్గము చర్యలు చేపట్టలేదు 2002 23 ఆర్థిక సంవత్సరం మధ్యలో 13 మంది అడ్డాలు కేటాయించారు. వారి బాకీలు ఐదు లక్షల పైన ఉన్నాయి. మిగతా పది అడ్డాలు ఖాళీగా ఉన్నాయి. అదనంగా 10 మడిగెలకు డిపాజిట్ కట్టని వారు పది మందికి పైగా అక్రమంగా ఉంటున్నప్పటికీ వారిపై చర్యలు తీసుకోవడానికి పాలకవర్గం మీనా మేషాలు లెక్కిస్తున్నారు. అక్రమంగా ఉన్నవారు రూ.ఐదు లక్షల వరకు వసూలు చేయాల్సి ఉంది. మొత్తంగా 2021 నవంబర్ ముందు నా బాకీలు కలిపి ఇప్పటివరకు 30 లక్షల వరకు బాకీలు వసూలు చేయకుండా తమకేమీ పట్టనట్లు పాలకవర్గం వ్యవహరిస్తున్నారు పంచాయతీ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించడం వల్లనే ఈ దుస్థితి నెలకొంది. పైఅధికారులకు వీటిపై చర్యలు తీసుకోవాలని గతంలో సీపీఐ(ఎం) నాయకులు వినతి పత్రం అందజేసినా స్పందించకపోవడం ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం అలసత్వం కనిపిస్తున్నదని ప్రజలు ఆరోపిస్తున్నారు .ఇప్పటికైనా ప్రజల సొమ్ము రికవరీ చేసి ప్రభుత్వానికి అప్పగించే బాధ్యత అధికారులపై ఉన్నదని ప్రజలు విమర్శిస్తున్నారు.