Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టరేట్లో సీపీఆర్‌పై శిక్షణా తరగతులు
- రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
ఆకస్మిక గుండెపోటు వల్ల వ్యక్తులు మరణించకుండా సీపీఆర్విధానంతో 50 శాతం ప్రాణాలు కాపాడిన వారమవుతామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సీపీఆర్‌పై ఏర్పాటు చేసిన శిక్షణా తరగతులనుద్దేశించి మంత్రి మాట్లాడారు.వయస్సుతో నిమిత్తం లేకుండా ఆకస్మిక గుండెపోటు వల్ల అనేకమంది మరణిస్తున్నారని వస్తున్న వార్తలు బాధను కలిగిస్తున్నాయన్నారు.ఆకస్మికగుండెపోటు వల్ల సంభవించే మరణాలను తగ్గించేందుకు ప్రభుత్వం కార్డియో పల్మనరీససీటేషన్ పై వైద్య ఆరోగ్యశాఖతో పాటు సాధారణ ప్రజలందరికీ శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.జీవన విధానంలో,వాతావరణం లో మార్పులు, ఆహారపు అలవాట్లు, ప్రకృతికి వ్యతిరేకంగా జరుగుతున్న పరిమాణాలు, పని ఒత్తిడి, పనులలో పోటీ తత్వం, మనిషి ఆశలు ఎక్కువగా పెంచుకోవడం వల్ల ఒత్తిడి ఎక్కువై గుండెపోటు వస్తుందన్నారు. ప్రభుత్వం వైద్యరంగంలో వేగంగా మార్పులు తీసుకువచ్చిందన్నారు.గతంలో ప్రభుత్వ దవాఖానలకు పోవద్దని దానిపై పాటలుకూడా పాడేవారని, కానీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వంపై నమ్మకం పెరిగిందన్నారు.ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలలో ప్రసవాల సంఖ్యపెరిగిందని తెలిపారు.గతంలో సిబ్బంది కొరత ఉండేదని తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సిబ్బందిని నియమాకాలు చేపట్టిందన్నారు.ప్రభుత్వ దవాఖానలు ప్రైవేటు దావాఖానాలకు దీటుగా నడుస్తున్నాయని పేర్కొన్నారు.అదనపుకలెక్టర్ పాటిల్హేమంతకేశవ్ మాట్లాడుతూ కోవిడ్ తర్వాత మారిన పరిస్థితులకు వాతావరణ మార్పులకు వయస్సుతో నిమిత్తం లేకుండా గుండెపోటుతో మరణిస్తున్నారన్నారు.దీనిని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం సీపీఆర్‌పై ముందుగా మాస్టర్ ట్రైనర్స్ శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం,తర్వాత రాష్ట్రంలోని ప్రజలందరికీ శిక్షణ ఇస్తున్నామన్నారు.ముందుగా వైద్య సిబ్బందికి తర్వాత పోలీసు మిగిలిన అన్ని శాఖలకు, ఐదుగురు రీసోర్స్ పర్సన్ ద్వారా ట్రైనింగ్ ఏర్పాటు చేశామన్నారు.అనంతరం కార్డియోపల్మోనరీ రిససిటేషన్ (సీపీఆర్) చేయు విధానాన్ని మంత్రి ట్రైనర్స్ సలహా మేరకు చేసి చూపించారు.అనంతరం మంత్రి కలెక్టర్‌తో కలిసి సీపీఆర్‌పై శిక్షణ పొందిన వారికి ధృవపత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ, గ్రంథాలయ చైర్మెన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మున్సిపల్ వైస్‌చైర్మెన్ పుట్టా కిషోర్,జెడ్పీ చైర్మెన్ గోపగాని వెంకటనారాయణగౌడ్, జెడ్పీటీసీ జీడిభిక్షం, అదనపుకలెక్టర్ ఎస్.మోహన్‌రావు,డీఎంహెచ్ఓ కోటాచలం, డిప్యూటీ డీఎంహెచ్ఓ హర్షవర్ధన్, డాక్టర్ కల్యాణ్, కార్యాలయ ఏఓ శ్రీదేవి, ఆర్డీఓ రాజేంద్రకుమార్, డిఎస్పి నాగభూషణం, మాస్టర్ ట్రైనిస్ ప్రజా ప్రతినిధులు సిబ్బంది పాల్గొన్నారు.