Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు వారి జీవనోపాధులను మెరుగుపరుచుకునేందుకు పలు ఆదాయాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టుటకు స్త్రీ నిధి క్రెడిట్ కో-ఆపరేటివ్ సంస్థ ద్వారా సూర్యాపేట జిల్లాలోని (5) మున్సిపాలిటీల పరిధిలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో సంఘాల మహిళలకు అధిక మొత్తంలో రుణాలందించిన మెప్మా జిల్లా విభాగం రాష్ట్రంలో ప్రథమస్థానం సాధించింది.శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన స్త్రీనిధి రాష్ట్రస్థాయి కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గ్రామీణ, పంచాయతీ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చేతుల మీద జిల్లా మెప్మా అధికారి రమేష్‌నాయక్ అవార్డును అందుకున్నారు.ఈ అంశంలో జిల్లాలోని మున్సిపాలిటీలలో అధికమొత్తంలో రుణాల పంపిణీ చేయడం, నిరర్థక బకాయిలు లేకుండా చూడడం వలన జిల్లాకు ప్రత్యేకగుర్తింపు దక్కింది.