Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హుజూర్నగర్
పట్టణంలోనే ఉస్మానియా మసీదులో పవిత్ర రంజాన్ సందర్భంగా వసతులు లేక ఉపవాసదీక్ష దారులుతీవ్ర ఇబ్బందులు తెలిపారు.శుక్రవారం రంజాన్ వేలలో ఉపవాసదారులు నిరసన దీక్షలు చేశారు.ఈ సందర్భంగా పలువురు ముస్లిం పెద్దలు మాట్లాడుతూ మసీదులో తాగునీరు ,విద్యుత్, పారిశుధ్యం లేకపోవడం వలన ఉపవాసదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.మంచినీటి సౌకర్యం కూడా లేదన్నారు.మసీదులో ఉన్న ఫిల్టర్ బెడ్‌ను వెంటనే రిపేర్ చేయాలన్నారు.మసీదులో ఉన్న కాంక్రీట్ మీద కొబ్బరి తివాచీలు వేయాలని కోరారు. ప్రభుత్వ ఆదేశాలను వక్ప్‌బోర్డు ఇన్స్పెక్టర్, మున్సిపల్ అధికారులు బేఖాతర్ చేస్తున్నారని తెలిపారు.ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకొని వక్ప్‌బోర్డు అధికారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో షేక్ మన్సూర్‌అలీ,సైదా, ఎస్కె.అలీ, ఎండి షఫీ,ఎండి అబ్దుల్ రహీం, ఎస్కె జానీపాషా, నవాబ్జాని, ఇబ్రహీం,రసూల్, అక్బర్, ఎండి.ఖయ్యూం, యూసుఫ్,ఎస్కె.ఖాశీం తదితరులు పాల్గొన్నారు.