Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ టీి. వినయ్ కృష్ణారెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
ఇటీవల ఆకాల వర్షాలు, వడగళ్ల వాన, ఈదురు గాలులతో జిల్లాలో జరగిన పంట నష్టంపై ప్రాథమిక నివేదిక ననుసరించి రైతు వారీగా పంట నష్టం వివరాలు అంచనా వేసి సమగ్ర నివేదిక రూపొందించాలని అధికారులను జిల్లా కలెక్టర్ టీ.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వ్యవసాయ, ఉద్యానశాఖ, రెవెన్యూ అధికారులతో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట నష్టం వివరాలపై ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఎక్కువ నష్టం జరిగినప్పుడు పంట నష్టం వివరాలు సేకరించడం జరుగుతుందని, పంట సాగు విస్తీర్ణంలో, ఉత్పత్తిలో 33 శాతం కంటే ఎక్కువ పంట నష్టం సంభవించిన వివరాలు క్షేత్రస్థాయిలో రైతు వారీగా, కౌలు రైతు వివరాలతో సమగ్ర నివేదిక సమర్పించాలని, సర్వేలో గుర్తించిన అంశాలను నిర్ణిత ప్రొఫార్మాలలో బ్యాంక్ అకౌంట్ వివరాలతో సహా పొందుపరచాలని ఆయన సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులను కోరారు. మండలాలలో సర్వే చేస్తునప్పుడు తహసీల్దార్లు సహకరించాలని తెలిపారు. పంట నష్టం నివేదిక ప్రభుత్వానికి నష్ట పరిహారంకు మంజూరుకు పంపించడం జరుగుతుందని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని సుచరిత, జిల్లా ఉద్యానశాఖ అధికారిణి సంగీత లక్ష్మి, వ్యవసాయశాఖ ఏడీ హుస్సేన్ బాబు తదితరులు పాల్గొన్నారు.