Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈనెల 5న చలో ఢిల్లీను జయప్రదం చేయండి :సీఐటీయూ
నవతెలంగాణ-నల్లగొండ
ప్రతినెలా మాదిరిగానే ఏప్రిల్ ఒకటవ తేదీన కమ్మరి, వడ్రంగి, కార్పెంటర్ల పనిబందు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, కమ్మరి, వడ్రంగి, కార్పెంటర్ వర్కర్స్ యూనియన్ నల్లగొండ పట్టణ అధ్యక్షులు సలివొజు సైదాచారి పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని దొడ్డి కొమరయ్య భవన్లో కమ్మరి, వడ్రంగి, కార్పెంటర్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) నల్లగొండ పట్టణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్పెంటర్ల సమస్యలపై పనిచేస్తూ నలగొండ పట్టణంలో కమ్మరి, వడ్రంగి, కార్పెంటర్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అనేక హక్కులు సాధించుకోవడం జరిగిందన్నారు. అర్హులైన కార్పెంటర్లకు ఇండ్లు, స్థలాలు, సంక్షేమ బోర్డు ద్వారా ద్విచక్ర వాహనాలకు రుణాలు, బ్యాంకుతో లింకు లేకుండా 2 లక్షల రూపాయలు పనిముట్లకు రుణాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మిక వ్యతిరేక విధానాలపై సీఐటీయూ కేంద్ర కమిటీ పిలుపుమేరకు ఏప్రిల్ 5న చలో ఢిల్లీ పార్లమెంటు ముందు ధర్నాలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు పోలే సత్యనారాయణ, కమ్మరి, వడ్రంగి , కార్పెంటర్ వర్కర్స్ యూనియన్ పట్టణ కార్యదర్శి దాసోజు ప్రభుచారి, కొల్లోజు జనార్దన్చారి, ఏలేశ్వరం జగదీశ్వరచారి, బైరోజు అంజయ్యచారి, దేవులపల్లి పురుషోత్తమాచారి, కావులపల్లి సురేష్, గుంటోజు సోమయ్య, బై రోజు వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు.