Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరుటౌన్
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీలో తమకు అన్యాయం జరిగిందని తహసీల్దార్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ దరఖాస్తుదారులు శనివారం ఎస్ఐ ఎండి ఇద్రిసు అలీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎమ్మార్వోను దృష్టికి తీసుకువెళ్లాగా తమకు ఫోన్ చేయవద్దని, అఖిలపక్ష కమిటీ సభ్యుల సమక్షంలోనే నిర్ణయం జరిగిందని, తిరిగి అఖిలపక్ష కమిటీ సమావేశమే ఏర్పాటు చేసి సమస్య ఏదైనా ఉంటే చర్చిస్తామని, ఎమ్మార్వో చెబుతున్నాడని, తమను ఫోన్ చేస్తే కేసు పెడతానని చెబుతున్నాడని పేర్కొన్నారు.
తహసీల్దార్ రామకృష్ణను వివరణ
ప్రతి పౌరునికీ ప్రభుత్వ అధికారిగా విధిగా గౌరవిస్తామని, ఒకే కుటుంబంలో ఒకరికి డబుల్ బెడ్ రూమ్ వచ్చినప్పటికీ,మరొకరు నా విధులకు ఆటంకం కలిగిస్తూ, ఒకే అంశంపై పదే పదే ఫోన్ చేస్తూ విసిగిస్తే స్పందించాల్సి వస్తుందన్నారు.అంతేకానీ ఎవరిపై కోపం, రాగద్వేషాలు ఉండవన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకే విధులు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ఆరోపణలు చేస్తున్న మహిళలు, తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు.