Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యాదగిరిగుట్టరూరల్: బస్వాపూర్ రిజర్వాయర్లో ముంపునకు గురవుతున్న యాదగిరిగుట్ట మండలం లప్ప నాయక్ తండ గ్రామస్తులు చేస్తున్న ఆందోళన శనివారం 17వ రోజు కొనసాగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలం అయిందని గ్రామస్తులు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బుజ్జి శంకర్ నాయక్, ఉపసర్పంచ్ మంక్యా నాయక్, మోహన్, దసిరం నాయక్, గ్రామపంచాయతీ పాలకవర్గం గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.