Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -రామన్నపేట
మానసికోల్లాసాన్ని పెంపొందించుకోవడానికి ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం చేయడం, ఆటలు ఆడుకోవాలని గ్రామ సర్పంచ్ యాదాసు కవిత యాదయ్య, ఎంపీటీసీ గాదె పారిజాత ముకుందం అన్నారు. శనివారం మండలంలోని మునిపంపుల గ్రామ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల రూమ్ టు రీడ్ పుస్తకాలు, ఆట వస్తువులను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు కథల పుస్తకాలు చదవడం, ఆటలాడడం వారి సంపూర్ణ వికాసానికి తోడ్పడుతుందని వారన్నారు.పాఠశాల అభివృద్ధికి నిరంతరం సహకరిస్తున్న దాతలకు, ప్రజాప్రతినిధులకు, తల్లిదండ్రులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కంచి రవికుమార్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు డోగిపర్తి భాస్కర్, ఉపాధ్యాయులు కృష్ణయ్య, వనజాత, ఉమ విద్యార్థులు పాల్గొన్నారు.