Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కురుమ సంఘం
నవతెలంగాణ- భువనగిరి రూరల్
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తొలి అమరుడైన దొడ్డి కొమురయ్య జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరుపాలని కోరుతూ శనివారం జిల్లా కురుమ సంఘం ఆద్వర్యంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షులు గవ్వల నర్సింహులు మాట్లాడుతూ తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చి భవిష్యత్ తరాలకు అందించాలని కోరారు. రాష్ట్ర కురుమ సంఘం నాయకులు ఇటీవల రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ను కలిసి ఈనెల 3 న జరిగే దొడ్డి కొమురయ్య జయంతిని అధికారికంగా జరపాలని కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భువనగిరి, యాదగిరిగుట్ట జిల్లా ప్రాదేశిక సభ్యులు సుబ్బురు బీరు మల్లయ్య, తోటకూరి అనురాధ, కురుమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డొంకెన బాలకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి కాదూరి అచ్చయ్య, జిల్లా గౌరవ సలహాదారులు జూకంటి రవీందర్, జిల్లా ఉపాధ్యక్షులు జాన సత్యనారాయణ, జిల్లా నాయకులు మోటె సత్యనారాయణ, కళ్ళేపల్లి శ్రీ శైలం, మండల అధ్యక్షులు కోడె మహేందర్ పాల్గొన్నారు.