Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్
- ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ,జెడ్పీ చైర్మెన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి
నవతెలంగాణ -భూదాన్ పోచంపల్లి
తెలంగాణ రాష్ట్ర అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందిందని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి జెడ్పీ చైర్మెన్ శనివారం మండల పరిధిలోని జూలూరు గ్రామం ధనలక్ష్మి గార్డెన్లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయలేని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నాయన్నారు. రైతుల సంక్షేమం కోసం బీఆర్ఎస్ పార్టీ చేస్తుందన్నారు కార్యకర్తలు బీఆర్ఎస్కు బలమన్నారు. ప్రభుత్వ పథకాలను గ్రామీణ స్థాయిలో ప్రజలకు తెలిసే విధంగా కార్యకర్తలు సురుగ్గా పాల్గొనాలన్నారు. భువనగిరి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. తొమ్మిది ఏండ్ల కాలంలో ఈ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశామన్నారు . ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రతి సంక్షేమ పథకాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు కార్యకర్త ప్రధాన పాత్ర పోషించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవ రెడ్డి.ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి రైతు సమన్వయ జిల్లా అధ్యక్షులు అమరేందర్, ఎంపీపీ మాడుగుల ప్రభాకర్ రెడ్డి , జెడ్పీటీసీ కోట పుష్పలత, పీఏసీఎస్ చైర్మెన్లు కందాల భూపాల్ రెడ్డి అందెల లింగం యాదవ్ఎంపీటీసీల ఫోరం అధ్యక్షురాలు బత్తుల మాధవి , ఆ పార్టీ మండల అధ్యక్షులు పాటి సుధాకర్ రెడ,కార్యకర్తలు, సర్పంచులు ,తదితరులు పాల్గొన్నారు.