Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
నవతెలంగాణ-సంస్థాన్ నారాయణపురం
గిరిజన తండాల అభివృద్దే సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని కొర్రతండా,గంగముల తండా, కడపగండి తండా,డాకు తండా, రాధనగర్ తండా, బోటిమిది తండా, వాచ్యతండా, పల్లగట్టు తండా,మర్రిబావి తండాల్లో రూ.4 కోట్ల నిధులతో సీసీ రోడ్లు,అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయా తండాలో నిర్వహించిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. గత 4 ఏండ్లుగా మునుగోడు నియోజకవర్గం అభివృద్ధిలో వెనకబడిపోయిందన్నారు. ఆగిన అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానన్నారు. గ్రామ పంచాయతీలకునిధులు కేటాయించి గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ పాటు పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఉమా ప్రేమ్చందర్ రెడ్డి,జెడ్పిటిసి వీరమల్ల భానుమతి వెంకటేష్, పీఏసీఎస్ చైర్మెన్ జక్కిడి జంగరెడ్డి,వైస్ ఎంపీపీరాజు, ఎంపీటీసీలు కరంటోతు విజయ,నరేష్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు దోనూరి జైపాల్ రెడ్డి,బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు కత్తుల లక్ష్మయ్య, పలువురు గిరిజనులు,అధికారులు, నాయకులు పాల్గొన్నారు.