Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
మండలపరిధిలోని కాపుగల్లు గ్రామంలో సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు జిల్లాదాసు గుండెపోటుతో మరణించడం జరిగిందని, వారి మరణం వారి కుటుంబానికి పార్టీకి తీరనిలోటుగా భావిస్తూ వారి ఆశయ సాధన కోసం పార్టీ కార్యకర్తలు ముందుకు రావాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మెదరమెట్ల వెంకటేశ్వరరావు అన్నారు.శనివారం కాపుగల్లు గ్రామంలో ఆ పార్టీ శాఖ ఆధ్వర్యంలో వారి భౌతికకాయానికి ఎర్రజెండా కప్పి జోహార్లర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 40 సంవత్సరాలుగా సుదీర్ఘంగా పార్టీలో కొనసాగుతూ పార్టీ డివిజన్ కమిటీ సభ్యుడిగా, జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం నాయకులుగా ప్రజా సమస్యల పైన అనేక ఉద్యమాలు కొనసాగిస్తూ గ్రామంలో ఉన్న ప్రజలందరితో మమేకమయ్యారన్నారు. గ్రామంలో పార్టీని బలోపేతం చేయడంలో అగ్రగామిగా నిలిచారన్నారు.గ్రామంలో పేదలకు ఇండ్లు,స్థలాలు కావాలని పోరాటం నిర్వహించడంతోపాటు వ్యవసాయ కార్మికుల సమస్యల పైన, రైతుల సమస్యల పైన అనేక ఉద్యమాలు నిర్వహించి వారి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ అధికారుల సైతం గ్రామాల్లోకి రప్పించి వారి సమస్య పరిష్కరించే వారని అన్నారు, కాపుల్లు గ్రామంలో సిపిఎంపార్టీ పైన అనేక నిర్బంధాలు ప్రయోగించిన మొక్కవోని ధైర్యంతో నిలబడి ఎర్రజెండాను ముందుకు తీసుకెళ్లారని వారన్నారు. కమ్యూనిస్టులు నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసే సమయంలో చనిపోయిన వారు చిరస్థాయిగా ప్రజల మనసుల్లో నిలుస్తారని దాసు చనిపోవడం పార్టీకి తీరని లోటుగా భావిస్తూ వారికి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలిపారు.ఈ కార్యక్రమంలో రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు బుర్రి శ్రీరాములు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ములకలపల్లి రాములు, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు జుట్టుకొండ బసవయ్య, దేవరం వెంకటరెడ్డి, బెల్లంకొండ సత్యనారాయణ, పట్టణ కార్యదర్శి ఎం.ముత్యాలు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు వెల్ది పద్మావతి, సిఐటియు జిల్లా కోశాధికారి కెవి నారాయణ, ఉపాధ్యక్షులు ఎస్ రాధాకృష్ణ, రైతు సంఘం జిల్లా నాయకులు ఏనుగుల వీరాంజనేయులు, దాసరి శ్రీనివాస్, కాసానిధనయ, లింగయ్య, బోస్, తదితరులు పాల్గొన్నారు.